Published : Feb 11, 2025, 03:53 PM ISTUpdated : Feb 11, 2025, 06:45 PM IST
Rashmi Gautam: యాంకర్ రష్మీ గౌతమ్ ఆసుపత్రి లో ఓ సర్జరి కోసం ఉన్నట్లు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఈ సర్జరీ కారణంగా ఆమె కొంతకాలం డాన్స్ చేయలేకపోతుందని తెలిపింది. అభిమానులు ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.
Anchor Rashmi Gautam instagram post about her shoulder surgery in telugu
యాంకర్ గా, నటిగా రష్మీ గౌతమ్ కు మంచి పేరు ఉంది. జబర్దస్త్ కామెడీ షోలకు వ్యాఖ్యాతగా ఆమె పాపులర్ అయ్యింది. అలాగే సినిమాల్లో అప్పుడప్పుడూ మెరుస్తూ, డ్యాన్స్ షోలలో అతిథిగా, టీమ్ లీడర్‌గా వ్యవహరిస్తోంది.
తమిళ, హిందీ, కన్నడ భాషల్లోనూ యాక్ట్ చేసింది. తెలుగులో.. గుంటూరు టాకీస్, బొమ్మ బ్లాక్‌బస్టర్, నెక్స్ట్ నువ్వే, అంతకుమించి.. ఇలా పలు చిత్రాల్లో యాక్ట్ చేసింది. ఇప్పుడామె హాస్పటిల్ లో ఉంది. సర్జరీ చేయించుకుంటోంది. ఈ మేరకు ఆమె ఓ పోస్ట్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది.
23
Anchor Rashmi Gautam instagram post about her shoulder surgery in telugu
యాంకర్ రష్మి గౌతమ్ లేటెస్ట్గా తన ఇన్స్టా స్టోరీలో ఓ ఫోటో షేర్ చేసింది. ఈ పోస్ట్లో రష్మి హాస్పిటల్ బెడ్ మీద ఉన్న ఫోటోలు షేర్ చేయడంతో తన అభిమానులు కంగారు పడుతున్నారు.
అయితే రష్మి షేర్ చేసిన ఫోటోకి "నేను సర్జరీ కోసం రెడీ అయ్యాను. నా భుజాన్ని సెట్ చేసుకోవాల్సి ఉంది. దాని వల్ల నాకు ఇష్టమైన డాన్స్ చేయలేకపోతున్నాను. దానికి నేను దూరంగా ఉండాల్సి వస్తుంది. ఆ సర్జరీ అయ్యాక పూర్తిగా సెట్ అవుతుంది.. మళ్ళీ నేను డాన్స్ చేయగలుగుతాను" అంటూ క్యాప్షన్ పెట్టింది.
33
Anchor Rashmi Gautam instagram post about her shoulder surgery in telugu
రష్మీ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దాంతో తన ఫ్యాన్స్ ఆందోళన చెందుతూ.. ఆమె త్వరగా కోలుకోవాలని రిప్లైలు పెడుతున్నారు. నటిగా టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ ఒరిస్సా బ్యూటీ.. ప్రస్తుతం స్టార్ యాంకర్గా తన హవాను కొనసాగిస్తోంది. తిరిగి వచ్చి ఆమె తన మరింత ఉత్సాహంతో కంటిన్యూ అవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు.