వీపులు గోకేది వాళ్లే.. చిరంజీవి ఇప్పుడు మాట్లాడి ఏం ప్రయోజనం.. నటి షాకింగ్ కామెంట్స్!

First Published Mar 4, 2020, 7:03 PM IST

మెగాస్టార్ చిరంజీవి 'ఓ పిట్టకథ' చిత్ర ప్రీరిలీజ్ వేడుకలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల చిరంజీవి ఎక్కువగా నిర్మాతల కోణంలో మాట్లాడుతున్నారు.

మెగాస్టార్ చిరంజీవి 'ఓ పిట్టకథ' చిత్ర ప్రీరిలీజ్ వేడుకలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల చిరంజీవి ఎక్కువగా నిర్మాతల కోణంలో మాట్లాడుతున్నారు. సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ వేడుకలో కూడా చిరంజీవి రెమ్యునరేషన్స్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
undefined
హీరోలు అడ్వాన్సులు తీసుకోవడం వల్ల నిర్మాతలకు అదనపు భారం అవుతోందని అన్నారు. మహేష్ తో పాటు తాను, రాంచరణ్ కూడా ప్రస్తుతం అడ్వాన్సులు తీసుకోకుండా సినిమా విడుదలయ్యాకే రెమ్యునరేషన్ తీసుకుంటున్నామని అన్నారు. ఇండస్ట్రీలో ఈ పద్దతి కొనసాగాలని దాని వల్ల నిర్మాతలకు ఎంతోకొంత భారం తగ్గుతుందని అన్నారు.
undefined
ఇక ఇటీవల ఓ పిట్టకథ ప్రీరిలీజ్ వేడుకలో చిరంజీవి ప్రస్తుతం క్యారవ్యాన్ ల వ్యవస్థ గురించి కామెంట్స్ చేశారు. నటీనటులకు సౌకర్యాలు పెరిగిపోవడం వల్ల షూటింగ్ పనిదినాలు పెరిగిపోయాయి. నిర్మాతలు ఇప్పటికే కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఇలా షూటింగ్ దినాలు కూడా పెరిగితే నిర్మాతలకు భారం అవుతుందని చిరు అన్నారు.
undefined
ఒకప్పుడు ఇన్ని సౌకర్యాలు లేవు. అప్పట్లో మేము క్యారవ్యాన్ లని కేవలాం బాత్రూం, మేకప్ కోసమే ఉపయోగించుకునేవాళ్ళం. సన్నివేశం అయిపోగానే అందులోకి వెళ్లిపోయే పద్దతి అప్పట్లో లేదు అని చిరు తెలిపారు.
undefined
చిరంజీవి వ్యాఖ్యలపై సీనియర్ నటి కవిత స్పందించారు. చిరంజీవి చెప్పింది నూటికి నూరుపాళ్ళు నిజం అని ఆమె అన్నారు. చెట్ల కిందే మేకప్ వేసుకోవడం, భోజనం చేయడం చేసేవాళ్ళం. కొన్ని సందర్భాల్లో బట్టలు మార్చుకోవడం కూడా చెట్ల వెనుకాలే జరిగేది.
undefined
ఈ ప్రస్తావన వచ్చింది కాబట్టి ఓ సంఘటన మీతో పంచుకుంటున్నా. ఓ చిత్ర షూటింగ్ లో నేను బట్టలు మార్చుకోవాల్సి వచ్చింది. అందుకోసం హీరోయిన్ క్యారవ్యాన్ ఉపయోగించుకోవాలనుకున్నా. కొన్నేళ్ల క్రిందటే ఈ సంఘటన జరిగింది. ఆమె కొత్త హీరోయిన్. తన క్యారవ్యాన్ లో బట్టలు మార్చుకోవడానికి ఆమె ఒప్పుకోలేదు. ఇది నా క్యారవ్యాన్.. మీరు ఎలా వెళతారు అని వాదించింది.
undefined
అప్పటి హీరోలకు పద్ధతులు తెలుసు. నటీనటుల్ని గౌరవించే వాళ్ళు. కానీ ఇప్పుడు వస్తున్న ఆర్టిస్టులు పొగరుతో వ్యవహరిస్తున్నారు అని కవిత కామెంట్స్ చేశారు. ఒకప్పుడు అందరం కలసి చెట్టు కిందే సన్నివేశం గురించి మాట్లాడుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు చిన్న ఆర్టిస్టులు పెద్ద ఆర్టిస్టుల క్యారవ్యాన్ లోకి వెళ్లి ప్రాక్టీస్ చేయాల్సి వస్తోంది. దీని వల్ల నిర్మాతలకే నష్టం. సమయం ఎక్కువ అవుతుంది.
undefined
దీనిపై దృష్టి పెట్టాల్సింది నిర్మాతలే. నా క్యారవ్యాన్ లోకి నువ్వు ఎందుకు వెళతావు అని హీరోయిన్ నన్ను తిడుతున్నప్పుడు నిర్మాత అక్కడే ఉన్నారు. ఆమెని వారించకుండా చూస్తూ ఉన్నాడు. ప్రస్తుతం ఉన్న నిర్మాతలే వీపులు గోకే రకాలు. అలాంటప్పుడు చిరంజీవి వాళ్ళ గురించి ఈ సమయంలో మాట్లాడి ఏం ప్రయోజనం అని కవిత అన్నారు.
undefined
ప్రస్తుతం తాను తమిళ చిత్రాల్లో నటిస్తున్నానని కవిత తెలిపింది. తెలుగులో ఛాన్సులు రాకపోవడానికి కారణం ఇక్కడి వారికీ పొరుగింటి పుల్లకూరే ఇష్టం అని ఎద్దేవా చేశారు. తమిళ చిత్ర పరిశ్రమలో ముందు తమిళ నటులకే ఛాన్స్ ఇస్తారు. కుదరకపోతే ఇతర భాషల నటుల్ని తీసుకుంటారు అని కవిత అన్నారు.
undefined
click me!