'పూరి జగన్నాథ్, సునీల్ మోసం చేశారు.. రవితేజ మాత్రం..' హీరో కామెంట్స్!

First Published | Jan 27, 2020, 3:11 PM IST

ఒకప్పుడు 'ఆనందం' వంటి హిట్ సినిమాల్లో నటించిన హీరో ఆకాష్ ఆ తరువాత నటుడిగా ఎక్కువ రోజులు కొనసాగించలేకపోయాడు.

ఒకప్పుడు 'ఆనందం' వంటి హిట్ సినిమాల్లో నటించిన హీరో ఆకాష్ ఆ తరువాత నటుడిగా ఎక్కువ రోజులు కొనసాగించలేకపోయాడు. ఇండస్ట్రీలో కాంపిటిషన్ పెరగడంతో ఆకాష్ సైడైపోయాడు.
undefined
అడపాదడపా సినిమాలు చేసినా పెద్దగా గుర్తింపు రాలేదు. ఆ మధ్య 'ఇస్మార్ట్ శంకర్' సినిమా సమయంలో ఆ కథ నాదేనంటూ మీడియా ముందుకు వచ్చి చెప్పాడు.
undefined
Tap to resize

ఆ కథతో సినిమా తీశానని రిలీజ్ చేయడానికి సిద్ధపడుతున్నానని చెప్పాడు. సినిమా విడుదల ఏం జరిగిందో ఏమో కానీ సైలెంట్ అయిపోయాడు.
undefined
తాజాగా మరోసారి మీడియా ముందుకు వచ్చిన ఆకాష్.. దర్శకుడు పూరి జగన్నాథ్, నటుడు సునీల్, హీరో రవితేజలపై కామెంట్స్ చేశాడు.
undefined
ఇండస్ట్రీలో చాలా మంది తనను వాడుకొని వదిలేశారని అన్నాడు. 'అందాల రాముడు' సినిమా షూటింగ్ సమయంలో సునీల్ తన దగ్గరకి వచ్చి గెస్ట్ చేయమని కోరాడని.. దీంతో ఆ సినిమాలో నటించానని చెప్పారు. కానీ సినిమా సక్సెస్ లో తనను భాగం చేయలేదని.. తన పేరు కూడా ఎక్కడా ప్రస్తావించలేదని అసహనం వ్యక్తం చేశారు.
undefined
ఇండస్ట్రీలో తనకు స్నేహితుడు అంటే ఒక్క రవితేజ మాత్రమేనని అన్నారు. ఇద్దరం కెరీర్ ఆరంభంలో కలిసి నటించిన విషయాలను గుర్తు చేసుకున్నాడు.
undefined
ఆ కారణంగానే రవితేజ తనను ఎంతో అభిమానంగా పలకరిస్తారని.. ఇద్దరం ఇప్పటికీ స్నేహంగా ఉంటున్నామని అన్నాడు. ఇండస్ట్రీలో ఒక హీరో ఎదగాలంటే ఇంకో హీరోని కచ్చితంగా తొక్కేయాల్సిందేనని.. అలా తనను చాలామంది ఇబ్బంది పెట్టారని సంచలన కామెంట్స్ చేశారు.
undefined
తను రాసుకున్న కథతోనే దర్శకుడు పూరి జగన్నాథ్ 'ఇస్మార్ట్ శంకర్' సినిమా తీశారని.. సినిమా విడుదలకు ముందు ట్రైలర్, టీజర్ చూసి ఉంటే అప్పుడే కోర్టుకి వెళ్లేవాడినని అన్నారు. సినిమా విడుదలను అడ్డుకోవాలనుకుంటే.. విడుదల రోజునైనా.. కేసు వేస్తే సినిమా కలెక్షన్స్ ఇన్ని వచ్చి ఉండేవికావన్నాడు.
undefined

Latest Videos

click me!