2020 బిగ్ మూవీస్.. టాలీవుడ్ @2వేల కోట్లు(+)

First Published Dec 18, 2019, 10:37 AM IST

గడిచిన ఐదేళ్లలో మన సినిమాల మార్కెట్ ఏ రేంజ్ కి వెళ్లిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఈ ఏడాది సాహో సైరా సినిమాల కారణంగా బిజినెస్ వేల కోట్లు దాటుతుంది అనుకున్నారు. కానీ వర్కౌట్ కాలేదు. కానీ నెక్స్ట్ ఇయర్ మాత్రం టాలీవుడ్ బిజినెస్ రెండు వేల కోట్లు దాటుతుందని అర్ధమవుతోంది. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతున్న క్రేజీ ప్రాజెక్ట్స్ పై ఓ లుక్కేద్దాం.. 

సరిలేరు నీకెవ్వరు: మహేష్ బాబు గత సినిమాలకంటే ఈ సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. సంక్రాంతి సీజన్ లో ఈజీగా 100కోట్ల బిజినెస్ చేయగల మహేష్ ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా 250కోట్ల వరకు బిజినెస్ చేయగలడు. రిలీజ్ డేట్ జనవరి 11
undefined
అల..వైకుంఠపురములో: అల్లు అర్జున్ - త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్నా సినిమా కాబట్టి ఇది కూడా 100కోట్ల వరకు బిజినెస్ చేయగలదని టాక్. హిట్టయితే కలెక్షన్స్ డోస్ 150కోట్లను కూడా ఈజీగా దాటుతుంది. రిలీజ్ డేట్ జనవరి 12
undefined
ఎంత మంచి వాడవురా: సంక్రాంతి సీజన్ లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న కళ్యాణ్ రామ్ 30కోట్ల టార్గెట్ పెట్టుకున్నాడు. సినిమాకు ఫ్యామిలీ ఆడియెన్స్ కనెక్ట్ అయితే 50కోట్ల బిజినెస్ చేయవచ్చు. రిలీజ్ డేట్ జనవరి 15
undefined
రజినీకాంత్ దర్బార్ సినిమా సంక్రాంతికి ముందు జనవరి 9న రిలీజ్ కాబోతోంది. తెలుగులో ఈ సినిమా హిట్టయితే 25కోట్లకు పైగా బిజినెస్ చేయగలదు.
undefined
జనవరి 24న రాబోతున్న డిస్కోరాజా సినిమాపై కూడా అంచనాలు భారీగా ఉన్నాయి. రవితేజ కెరీర్ లోనే ఇదొక డిఫరెంట్ మూవీ. ఈ సినిమా 30కోట్ల మేర బిజినెస్ చేయనుంది. హిట్టయ్యియితే డబుల్ ప్రాఫిట్స్ పక్కా.
undefined
నిశ్శబ్దం జనవరి 31న రిలీజ్ కాబోతోంది. అనుష్క తన మార్కెట్ తో మరోసారి టాలీవుడ్ లో సరికొత్త రికార్డ్ చేయనున్నట్లు తెలుస్తోంది. 35నుంచి 50కోట్ల మేర బిజినెస్ జరగనుంది.
undefined
వరల్డ్ ఫెమస్ లవర్: విజయ్ దేవరకొండ ఈ సినిమాలో నలుగురి హీరోయిన్స్ తో రొమాన్స్ చేయనున్నాడు. ఫిబ్రవరి 14న సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమా 40కోట్లకు పైగా బిజినెస్ చేయనుంది.
undefined
నాని 25వ చిత్రం V మార్చ్ 25న రానుంది. నాని గత సినిమాలకంటే ఈ సినిమా బడ్జెట్ ఎక్కువే. ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద 50కోట్లవరకు అందుకోగలదని టాక్.
undefined
నాగ చైతన్య - సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త సినిమా ఏప్రిల్ లో  ప్రేక్షకుల ముందుకు రానుంది. ఏ సినిమా హిట్టయితే 50కోట్ల వరకు ఈజీగా బిజినెస్ చేయగలదు.
undefined
రామ్ - కిషోర్ తిరుమల కాంబినేషన్ లో తెరకెక్కనున్న రెడ్ సినిమా ఏప్రిల్ 14న రాబోతోంది. థ్రిల్లర్ జానర్ లో రాబోతున్న ఈ సినిమా బిజినెస్ 40కోట్ల వరకు ఉంటుందని చెప్పవచ్చు.
undefined
ఫైనల్ గా 2020లోనే అతిపెద్ద సినిమా RRR. ఈ సినిమా బడ్జెట్ 400కోట్లు. ఇక ప్రీ రిలీజ్ బిజినెస్ ఈజీగా 500కోట్లు దాటుతుంది. సినిమా రిలీజ్ తరువాత ఆ బిజినెస్ 1000కోట్లు కూడా దాటుతుందని చెప్పవచ్చు,.
undefined
మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కమర్షియల్ సినిమా 100కోట్ల బిజినెస్ చేయగలదు. ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంటే శ్రీమంతుడు లెవెల్లో కొరటాల డబుల్ ప్రాఫిట్స్ ని అందుకోవచ్చు.
undefined
KGF 2: ఈ సినిమా కూడా తెలుగులో భారీ స్థాయిలో విడుదల కానుంది. ఈజీగా 25కోట్ల బిజినెస్ చేయవచ్చు.
undefined
త్రివిక్రమ్ ఎన్టీఆర్ తో మరో సినిమా చేసే అవకాశం ఉంది. ఆ ప్రాజెక్ట్ 2020లోనే రానుంది. అల వైకుంఠపురములో - RRR సినిమా హిట్టయితే.. వీరు చేయబోయే తదుపరి సినిమా బిజినెస్ 200కోట్లు దాటినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.
undefined
ప్రభాస్ జాన్ సినిమా 2020 దసరాకి రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఈ సినిమా బడ్జెట్ 150కోట్లకు చేరుతోంది. అంటే మరో 250కోట్ల లెక్కలతో ప్రభాస్ సరికొత్త రికార్డును క్రియేట్ చేయవచ్చని టాక్.
undefined
అల్లు అర్జున్:నా పేరు సూర్య కారణంగా బన్ని మరో ప్రాజెక్ట్ చేయడానికి చాలా సమయం తీసుకున్నాడు. ఫైనల్ గా త్రివిక్రమ్ తో సినిమాను ఒకే చేసి నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి రావాలని డేట్ ఫిక్స్ చేసుకున్న విషయం తెలిసిందే.
undefined
click me!