2009 TO 2020 సంక్రాంతి ఫైట్ లో గెలిచిందెవరు?

First Published Jan 16, 2020, 4:16 PM IST

సంక్రాంతి రాగానే టాలీవుడ్ కి ఒక ప్రత్యేకమైన కళ ఏర్పడుతుంది. మంచి సక్సెస్ అందుకోవాలని చాలా మంది హీరోలు పొంగల్ కి సినిమాలని రిలీజ్ చేస్తుంటారు. ఇక 2009 నుంచి 2020వరకు పోటీ పడ్డ సంక్రాంతి సినిమాలపై ఒక లుక్కేద్దాం పదండి.. 
 

2009 అరుంధతి - మస్కా - ఫిట్టింగ్ మాస్టర్.. ఈ బాక్స్ ఆఫీస్ ఫైట్ లో విన్నర్ గా అరుంధతి నిలించింది. మాస్క యావరేజ్ హిట్ గా నిలవగా ఫిట్టింగ్ మాస్టర్ ప్లాప్ గా నిలిచింది.
undefined
2010: అదుర్స్ సినిమాతో తారక్ కామెడీ అండ్ మాస్ ఎలిమెంట్స్ తో సక్సెస్ అందుకోగా వెంకీ  నమో వెంకటేశ- రవితేజ శంభో శివ శంభో సినిమాలు బోల్తా పడ్డాయి.
undefined
2011: మిరపకాయ్ సినిమాతో మాస్ రాజా సాలిడ్ హిట్ అందుకోగా సిద్దార్థ్ అనగనగ ఓ ధీరుడు,బాలకృష్ణ పరమవీర చక్ర సినిమాలతో డిజాస్టర్ అందుకున్నారు. ఇక సుమంత్ గోల్కొండ హై స్కూల్ పరవాలేధనిపించే విధంగా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.
undefined
2012: బిజినెస్ మెన్ - బాడీగార్డ్: రెండు సినిమాలు వారి అభిమానులకు మంచి కిక్కిచ్చాయి.
undefined
2013: నాయక్ -సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలతో ఎవరి స్థాయిలో వారు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ అందుకున్నారు.
undefined
2014: నేనొక్కడినే - ఎవడు: మహేష్ ప్రయోగం చేసి సంక్రాంతికి ఊహించని అపజయాన్ని మూటగట్టుకున్నాడు. కానీ ఎవడు సినిమాతో చరణ్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో మంచి విజయాన్ని అందుకున్నాడు.
undefined
2015: గోపాల గోపాల సినిమా అనుకున్నంతగా విజయాన్ని అందుకోకపోయిన పవర్ స్టార్ క్రేజ్ తో ఓపెనింగ్స్ ని గట్టిగానే రాబట్టింది. ఇక శంకర్ ఐ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది.
undefined
2016సంక్రాంతిలో నాగ్ - శర్వానంద్ ఊహించని విధంగా బాక్స్ ఆఫీస్ హిట్ అందుకుంటే.. జూనియర్ ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో ఆడియెన్స్ అంచనాలను అందుకోవడంలో సక్సెస్ అయ్యింది. ఇక బాలకృష్ణ మాత్రం డిక్టేటర్ గా వచ్చి డిజాస్టర్ అందుకున్నాడు.
undefined
2017: బాలయ్య హిస్టారికల్ మూవీ - చిరు రీ ఎంట్రీ సినిమా.. రెండు కూడా మంచి విజయాన్ని అందుకున్నాయి. శతమానం భవతి కూడా ఫ్యామిలీ ఆడియెన్స్ సపోర్ట్ తో సంక్రాంతి విన్నర్ గా నిలిచింది.
undefined
2018: పవన్ - త్రివిక్రమ్ కాంబో అజ్ఞాతవాసి బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలువగా బాలకృష్ణ జై సింహా మాత్రం మాస్ ఆడియెన్స్ ని ఎట్రాక్ట్ చేసి సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. ఇక నాగార్జున నిర్మాతగా తెరకెక్కిన రాజ్ తరుణ్ రంగుల రాట్నం కలెక్షన్స్ అందుకోలేక మొదటి రోజే డీలా పడింది.
undefined
2019: ఎన్టీఆర్ బయోపిక్ పార్ట్ 1 ఓపెనింగ్స్ తో యావరేజ్ టాక్ తెచ్చుకోగా వెంకీ వరుణ్ ల F2 ఇండస్ట్రీ హిట్ ని అందుకుంది. ఇక పేట - వినయ విధేయ రామ సినిమాలు ఆడియెన్స్ అంచనాలకు అందుకోలేక ప్లాప్ లిస్ట్ లోకి చేరిపోయాయి.
undefined
2020:మహేష్ - అల్లు అర్జున్ పోటాపోటీగా కలెక్షన్స్ అందుకుంటున్నారు. ఇక దర్బార్ - ఎంత మంచివాడవురా సినిమాలు ఈ పోటీలో నిలదొక్కుకునేలా కనిపించడం లేదు. ఈ సంక్రాంతి విన్నర్ ఎవరో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.
undefined
click me!