ఇండో పాక్ మ్యాచ్: ధోనిని మించిపోయిన రో''హిట్''...అరుదైన రికార్డులెన్నో

First Published Jun 17, 2019, 7:56 PM IST

టీమిండియా ఓపెనర్  రోహిత్ శర్మ హిట్టింగ్ ముందు మాంచెస్టర్ స్టేడియం చిన్నబోయింది. ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా జరిగిన ఇండో పాక్ మ్యాచ్ లో అతడు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. పాక్ బౌలర్లను ఉతికారేస్తూ అద్భుత శతకాన్ని నమోదు చేసుకున్నాడు. కేవలం 113 బంతుల్లోనే 140 పరుగులతో ప్రతిష్టాత్మక మ్యాచ్ లో సత్తా చాటి భారత్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఇలా సెంచరీ సాధించే క్రమంలో రోహిత్ ఖాతాలో కొన్ని అరుదైన రికార్డులుమ వచ్చి చేరాయి. వాటిల్లో ఒకటే ధోని సిక్సర్ల రికార్డు బద్దలు. 

undefined
మహేంద్ర సింగ్ ధోని అంటే ముందుగా గుర్తొచ్చేది అతడి హెలికాప్టర్ షాట్లు. అతడు బలంగా బంతిని బాదాడంటే అది గింగిరాలు తిరుగుతూ బౌండరీ దాటాల్సిందే. ఇలా ధోని ఇప్పటివరకు అన్ని ఫార్మాట్లలో కలిపి 355 సిక్సర్లు బాదాడు. అయితే సిక్సర్లు బాదడంలో భారత జట్టులో ధోనికి ఎవరైన ఫోటీ వున్నారంటే అది రోహిత్ శర్మనే. ఇతడు కూడా అలవోకగా బంతిని బౌండరీకి తరలించడంలో సిద్దహస్తుడు. ఇలా బౌండరీల విషయంలో పోటీ పడుతున్న వీరిద్దరిలో తాజాగా రోహిత్ పైచేయి సాధించింది.
undefined
సెంచరీ సాధించే క్రమంలో రోహిత్ మూడు సిక్సర్లు బాదాడు. వీటితో రోహిత్ ఖాతాలోకి 358 సిక్సర్లు చేరాయి. ఈ మ్యాచ్ కు ముందు 355 సిక్సర్లతో ధోనితో కలిపి మొదటి స్థానాన్ని పంచుకున్న రోహిత్ తాజాగా అతన్ని వెనక్కినెట్టాడు. ఇలా మొదటిసారి టీమిండియా తరపున అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్ గా హిట్ మ్యాన్ నిలిచాడు.
undefined
ఇలా అత్యధిక సిక్సర్ల జాబితాలో రోహిత్ మొదటి స్థానంలో, ధోని రెండో స్థానంలో నిలిచారు. వీరిద్దరి తర్వాత 264 సిక్సర్లతో సచిన్ మూడు, 251 సిక్సర్లతో యువరాజ్ నాలుగో, 247 సిక్సర్లతో గంగూలి ఐదో స్థానంలో నిలిచారు.
undefined
ఇదే మ్యాచ్ లో రోహిత్ 113 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్సర్లతో 140 పరుగుల వ్యక్తిగత స్కోరు సాధించాడు. ఇలా ప్రపంచ చరిత్రలో పాక్‌పై రెండో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ఆటగాడిగా రోహిత్ ఘనత సాధించాడు. పాక్‌పై ప్రపంచ కప్ పోటీల్లో అత్యధిక వ్యక్తిగత పరుగుల సాధించిన రికార్డు ఆస్ట్రేలియా ఆటగాడు ఆండ్రూ సైమండ్స్‌ పేరిట ఉంది. 2003 ప్రపంచ కప్ పోటీల్లో జోహెనెస్‌బర్గ్‌లో పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో సైమండ్స్‌ అజేయంగా 143 పరుగులు సాధించాడు. ఆ తర్వాత స్థానాన్ని రోహిత్‌ ఆక్రమించాడు.
undefined
ఇక పాకిస్తాన్‌పై వరల్డ్‌కప్‌లో సెంచరీ సాధించిన రెండో భారత ఆటగాడిగా రోహిత్‌ శర్మ గుర్తింపు సాధించాడు. గతంలో పాక్‌పై విరాట్‌ కోహ్లి వరల్డ్‌కప్‌ సెంచరీ సాధించాడు. 2015లో కోహ్లి ఈ ఘనత సాధించగా, ఇప్పుడు కోహ్లి సరసన రోహిత్‌ చేరాడు.
undefined
click me!