ఐపీఎల్ 2008 సీజన్ నుంచి అన్నీ సీజన్లలో ఆడుతున్న అతికొద్ది మంది ప్లేయర్లలో రాబిన్ ఊతప్ప ఒకడు. ఐపీఎల్ కెరీర్ ఆరంభంలో ముంబై ఇండియన్స్ ఆడిన ఊతప్ప, ఆ తర్వాత ఆర్‌సీబీ, పూణే వారియర్స్, కోల్‌కత్తా నైట్‌రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ తరుపున ఆడాడు. ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్‌లో ఉన్నాడు...
ఐపీఎల్ 2021 సీజన్ నాకౌట్ మ్యాచుల్లో అద్భుతమైన పర్ఫామెన్స్ ఇచ్చిన రాబిన్ ఊతప్పని, మెగా వేలంలో రూ.2 కోట్లకు కొనుగోలు చేసింది చెన్నై సూపర్ కింగ్స్...
210
ఐపీఎల్ కెరీర్‌లో 196 మ్యాచులు ఆడిన రాబిన్ ఊతప్ప, 26 హాఫ్ సెంచరీలతో 4813 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్లలో ఒకడిగా ఉన్నాడు ఊతప్ప..
310
మొదటి సీజన్ తర్వాత ముంబై ఇండియన్స్ నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి ట్రాన్స్‌ఫర్ అయిన ముగ్గురు ప్లేయర్లలో వికెట్ కీపర్ బ్యాటర్ రాబిన్ ఊతప్ప కూడా ఒకడు...
410
Robin Uthappa
‘నేను, జహీర్ ఖాన్, మనీశ్ పాండే కలిసి ముంబై ఇండియన్స్‌లో ఉన్నాడు. ఐపీఎల్‌లో టీమ్ ట్రాన్స్‌ఫర్ అయిన మొదటి ప్లేయర్లలో నేను ఒకడిని...
510
ఆ సమయంలో సచిన్ టెండూల్కర్ కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్ తరుపున ఆడాలని మెంటల్‌గా కట్టుబడిపోయా. అయితే ఐపీఎల్ అయ్యాక నెలరోజులకే టీమ్ మారాలని చెప్పారు...
610
ట్రాన్స్‌ఫర్ పేపర్లపై సంతకం చేసేందుకు నేను ఒప్పుకోలేదు.ముంబై ఇండియన్స్‌లో ఓ వ్యక్తి, ట్రాన్స్‌ఫర్ పేపర్లపై సంతకం చేయకపోతే, టీమ్‌లో చోటు ఉండదని భయపెట్టాడు. బలవంతంగా నాతో సంతకాలు చేయించాడు...
710
నా పర్సనల్ లైఫ్‌లోనూ ఆ సమయంలో కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ కారణంగా ఆర్‌సీబీతో ఆడిన మొదటి సీజన్‌లో తీవ్రమైన డిప్రెషన్‌లో ఉన్నా.
810
ఆ సీజన్‌లో ఒక్క మ్యాచ్‌లో కూడా బాగా ఆడలేకపోయా. నన్ను తప్పించి, మళ్లీ ఆడించిన మ్యాచ్‌లో మాత్రం రాణించగలిగాను...’ అంటూ షాకింగ్ విషయాన్ని బయటపెట్టాడు రాబిన్ ఊతప్ప...
910
ఐపీఎల్ 2008 సీజన్‌లో ముంబై ఇండియన్స్ తరుపున 14 మ్యాచులు ఆడిన రాబిన్ ఊతప్ప, 35.55 సగటుతో 320 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 48 పరుగులు...
1010
ఐపీఎల్ 2009 సీజన్‌లో ఆర్‌సీబీ తరుపున 15 మ్యాచులు ఆడిన రాబిన్ ఊతప్ప, 13 ఇన్నింగ్స్‌ల్లో 175 పరుగులే చేయగలిగాడు. అత్యధిక స్కోరు 66 పరుగులు నాటౌట్ కాగా, సగటు 15.90 మాత్రమే.. 2014 సీజన్‌లో 660 పరుగులు చేసిన రాబిన్ ఊతప్ప, ఆరెంజ్ క్యాప్ గెలిచాడు.