టీమ్ పొజిషన్‌తో, బౌలర్‌తో ఏ మాత్రం సంబంధం లేకుండా క్రీజులోకి వస్తే కొట్టడమే టార్గెట్‌గా పెట్టుకుంటాడు రిషబ్ పంత్. ఐపీఎల్ 2021 సీజన్‌లో కెప్టెన్సీలోనూ ఇదే దూకుడు చూపించాడు రిషబ్ పంత్. అయితే ఈ సారి పంత్ కెప్టెన్సీలో ఆ పవర్ కనిపించడం లేదు...
ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లలిత్ యాదవ్, అక్షర్ పటేల్ ఇన్నింగ్స్‌ల కారణంగా విజయాన్ని అందుకున్న ఢిల్లీ క్యాపిటల్స్, ఆ తర్వాత వరుసగా రెండు మ్యాచుల్లో ఓటమి పాలైంది...
211
లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్, కేవలం 149 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆఖరి దాకా క్రీజులో ఉన్న రిషబ్ పంత్ 36 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 39 పరుగులు చేశాడు...
311
పృథ్వీషా సునామీ ఇన్నింగ్స్ కారణంగా 7 ఓవర్లలో 67 పరుగులు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్, ఆ తర్వాత డేవిడ్ వార్నర్, పావెల్ వికెట్లు త్వరగా కోల్పోయింది. చేతిలో 7 వికెట్లు ఉన్నా భారీ స్కోరు చేయలేకపోయింది...
411
లలిత్ యాదవ్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్ వంటి భారీ హిట్టర్లు బ్యాటింగ్‌కి రావాల్సి ఉన్నా, రిషబ్ పంత్ క్రీజులో నిలదొక్కుకోవడానికి చాలా సమయం తీసుకున్నాడు. ఈ కారణంగా ఢిల్లీ క్యాపిటల్స్ అనుకున్న స్కోరు చేయలేకపోయింది...
511
మొదటి 19 బంతుల్లో 9 పరుగులు చేసిన రిషబ్ పంత్, ఆ తర్వాత 17 బంతుల్లో 30 పరుగులు చేశాడు. స్పిన్నర్ల బౌలింగ్‌లో 17 బంతులాడిన పంత్, 6 పరుగులు మాత్రమే చేయగలిగాడు...
611
‘ఢిల్లీకి అతిపెద్ద సమస్య రిషబ్ పంత్ బ్యాటింగ్ స్టైల్. గెలిచినా, ఓడినా రిషబ్ పంత్ తన స్టైల్‌లో ఆడితే టీమ్‌లో ఆత్మవిశ్వాసం, జోష్ నిండుతుంది...
711
పంత్ తన యాటిట్యూడ్ మార్చుకుని, ఇలా 60, 70 పరుగులు చేసినా టీమ్‌లో నిస్తేజం తప్ప, ఊపు ఉండదు. రిషబ్ పంత్ 36 బంతులు ఆడితే 60కి పరుగులు చేయాలి...
811
పంత్ మరో 20 పరుగులు చేసి ఉంటే లక్నోకి కచ్చితంగా కష్టమైపోయేది. కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్నంత మాత్రాన స్లోగా ఆడుతూ బాధ్యతగా ఆడాలనే ఆలోచనతో ఉండడం సరికాదు...
911
గత సీజన్‌లో రిషబ్ పంత్‌లో ఇలాంటి యాటిట్యూడ్ చూడలేదు. ఇలాగే ఆడితే ఐపీఎల్‌లో రిషబ్ పంత్ కెప్టెన్‌గా సక్సెస్ కాలేడు. తన యాటిట్యూడ్, స్టైల్ కారణంగా అయ్యర్‌లాంటి సక్సెస్‌ఫుల్ కెప్టెన్ కూడా సైడ్ అయ్యాడని గుర్తుంచుకోవాలి...
1011
తను రాగానే హిట్టింగ్‌కి దిగాలి. మిస్ అయితే పెవిలియన్‌కి చేరాలి. షాట్ సెలక్షన్ విషయంలో కాస్త జాగ్రత్త తీసుకుంటే చాలు. మోటివేషన్ కావాలంటే తన పాత వీడియోలు చూసుకుంటే చాలు...
1111
టెస్టుల్లో హిట్టింగ్ చేసిన రిషబ్ పంత్, కెప్టెన్ అయ్యానని ఇలా నెమ్మదిగా ఆడితే... అది టీమ్‌పై ఎఫెక్ట్ చూపిస్తుంది...’ అంటూ చెప్పుకొచ్చాడు భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్..