SRHvsDC: ఢిల్లీ బ్యాట్స్‌మెన్‌కి ఆరెంజ్ పంచ్... సన్‌రైజర్స్ హైదరాబాద్‌ ముందు ఊరించే టార్గెట్...

First Published Apr 25, 2021, 9:17 PM IST

IPL 2021: టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. ఒకానొక దశలో 10 ఓవర్లు ముగిసేసరికి 81/0 వద్ద ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ భారీ స్కోరు చేసేటట్టు కనిపించినా... అద్భుతమైన కమ్‌బ్యాక్ ఇచ్చిన సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లు ఓ మాదిరి స్కోరుకే కట్టడి చేయగలిగారు.

ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్లు పృథ్వీషా, శిఖర్ ధావన్ మొదటి వికెట్‌కి 81 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి శుభారంభం అందించారు.
undefined
26 బంతుల్లో 3 ఫోర్లతో 28 పరుగులు చేసిన శిఖర్ ధావన్‌ను రషీద్ ఖాన్ అవుట్ చేశాడు. 81 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది ఢిల్లీ క్యాపిటల్స్...
undefined
39 బంతుల్లో 7 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 53 పరుగులు చేసి హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్న పృథ్వీషా... లేని పరుగు కోసం ప్రయత్నించి రనౌట్ అయ్యాడు.
undefined
27 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 37 పరుగులు చేసిన రిషబ్ పంత్, సిద్ధార్థ్ కౌల్ బౌలింగ్‌లో సుచిత్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.
undefined
ఆ తర్వాత హెట్మయర్ కూడా 2 బంతుల్లో ఒకే పరుగు చేసి సిద్ధార్థ్ కౌల్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు.
undefined
స్టీవ్ స్మిత్ ఇచ్చిన ఈజీ క్యాచ్‌ను జారవిడిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ భారీ మూల్యం చెల్లించుకుంది. ఆఖరి ఓవర్‌లో వరుసగా ఓ ఫోర్, సిక్సర్ బాదిన స్టీవ్ స్మిత్... 25 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్స్‌తో 35 పరుగులు చేశాడు.
undefined
click me!