సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్‌లను దాటేసిన రోహిత్ శర్మ... ‘హిట్ మ్యాన్’ ఖాతాలో రేర్ రికార్డు...

First Published Jun 18, 2021, 6:13 PM IST

భారత ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మ కెరీర్‌లో ఓ అరుదైన రికార్డును క్రియేట్ చేయబోతున్నాడు. ఇప్పటికే ఓపెనర్‌గా మూడు ఐసీసీ టోర్నీల్లో పాల్గొన్న రోహిత్ శర్మకి, ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ నాలుగో ఫైనల్ మ్యాచ్...

భారత జట్టు తరుపున అత్యధిక ఐసీసీ ఫైనల్స్ ఆడిన ఓపెనర్‌గా రికార్డు క్రియేట్ చేయబోతున్నాడు రోహిత్ శర్మ. కెరీర్ ఆరంభంలో మిడిల్ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌గా ఆడిన రోహిత్ శర్మ, పెద్దగా సక్సెస్ కాలేకపోయాడు...
undefined
ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ సారథిగా మారిన తర్వాత ఓపెనింగ్ చేయడంతో అతని కెరీర్ గ్రాఫ్ మారిపోయింది. 2013లో ఓపెనర్‌గా మారిన రోహిత్ శర్మ, వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు, టీ20ల్లో నాలుగు సెంచరీలతో అద్భుతమైన రికార్డులు క్రియేట్ చేశాడు...
undefined
ఇంతకుముందు భారత జట్టు తరుపున సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్ మాత్రమే అత్యధిక సార్లు ఐసీసీ ఫైనల్స్ ఆడిన ఓపెనర్లుగా ఉన్నారు. ఈ ఇద్దరూ మూడేసి సార్లు ఓపెనర్లుగా ఐసీసీ ఫైనల్స్ ఆడారు...
undefined
రోహిత్ శర్మ ఇంతకుముందు 2013 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌, 2014 టీ20 వరల్డ్‌కప్ ఫైనల్‌తో పాటు 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లోనూ ఓపెనర్‌గా ఆడాడు...
undefined
2013 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో రోహిత్ శర్మ, శిఖర్ ధావన్‌తో కలిసి ఓపెనింగ్ చేశాడు. 14 బంతుల్లో 9 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఉత్కంఠభరితంగా సాగిన ఆ మ్యాచ్‌లో భారత జట్టు 5 పరుగుల తేడాతో విజయం సాధించింది...
undefined
2014 టీ20 వరల్డ్‌కప్‌ ఫైనల్ మ్యాచ్‌లో అజింకా రహానేతో కలిసి ఓపెనింగ్ చేశాడు రోహిత్ శర్మ. 26 బంతుల్లో 3 ఫోర్లతో 29 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. విరాట్ కోహ్లీ 77 పరుగులు చేసినా మిగిలిన బ్యాట్స్‌మెన్ ఘోరంగా ఫెయిల్ కావడంతో భారత జట్టు 6 వికెట్ల తేడాతో ఓడింది...
undefined
2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో రోహిత్ శర్మ, శిఖర్ ధావన్‌తో లకిసి ఓపెనింగ్ చేశాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్ 3 బంతులాడి డకౌట్ అయ్యాడు. భారత జట్టు, పాక్ చేతుల్లో 180 పరుగుల భారీ తేడాతో చిత్తుగా ఓడింది...
undefined
ఇదేకాకుండా 2007 టీ20 వరల్డ్‌కప్ ఫైనల్‌లో కూడా రోహిత్ శర్మ ఆడాడు. అయితే ఆరో నెంబర్ బ్యాట్స్‌మెన్‌గా వచ్చిన రోహిత్ శర్మ, 16 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్స్‌తో 30 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో భారత జట్టు 5 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది.
undefined
వన్డే ఎంట్రీ ఇచ్చిన ఆరేళ్లకు టెస్టుల్లోకి వచ్చిన రోహిత్ శర్మ, టెస్టుల్లో మొదటి మ్యాచ్ ఆడిన ఆరేళ్ల తర్వాత ఓపెనర్‌గా మారాడు. గత రెండేళ్లుగా ఓపెనర్‌గా రాణిస్తున్న రోహిత్ శర్మకు... విదేశాల్లో ఒక్క టెస్టు సెంచరీ కూడా లేదు...
undefined
ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో రోహిత్ శర్మపై భారీ అంచనాలు ఉన్నాయి. ఫైనల్ మ్యాచ్‌లో రోహిత్ సెంచరీ చేస్తే చూడాలని కోరుకుంటున్నారు హిట్ మ్యాన్ ఫ్యాన్స్.
undefined
click me!