బుమ్రా ప్లేస్‌లో షమీని ఆడించే ఆలోచన లేదా? ఆసీస్‌తో వార్మప్ మ్యాచ్‌లో తుది జట్టులో లేని మహ్మద్ షమీ...

First Published | Oct 17, 2022, 10:16 AM IST

జస్ప్రిత్ బుమ్రా గాయపడడంతో అతని ప్లేస్‌లో సీనియర్ పేసర్ మహ్మద్ షమీని టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి ఎంపిక చేసింది టీమిండియా. గత ఏడాది యూఏఈలో జరిగిన పొట్టి ప్రపంచకప్ తర్వాత ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడని షమీ, నేరుగా మళ్లీ టీ20 వరల్డ్ కప్‌లోనే ఆడబోతున్నాడు..

Image credit: Getty

టీ20 వరల్డ్ కప్‌ ముందు టీ20 ప్రాక్టీస్ కోసం ఆస్ట్రేలియాతో, సౌతాఫ్రికాతో జరిగిన టీ20 సిరీసుల్లో మహ్మద్ షమీని ఆడించాలని భావించింది టీమిండియా మేనేజ్‌మెంట్. అయితే ఆసీస్‌తో టీ20 సిరీస్ ఆరంభానికి ముందు మహ్మద్ షమీ కరోనా పాజిటివ్‌గా తేలాడు..

Mohammed Shami

మహ్మద్ షమీ కరోనా నుంచి కోలుకుని, తిరిగి పూర్తి ఫిట్‌నెస్ సాధించడానికి చాలా సమయమే తీసుకోవడంతో ఈ రెండు టీ20 సిరీసుల్లో ఆడలేకపోయాడు. అయితే భారత జట్టుకి మరో ఆప్షన్ లేకపోవడంతో ఫిట్‌నెస్ సాధించిన తర్వాత షమీని నేరుగా ఆస్ట్రేలియా విమానం ఎక్కించారు...


Mohammed Shami

తాజాగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న వార్మప్ మ్యాచ్‌లో తుది 11 మంది ప్లేయర్లలో మహ్మద్ షమీకి చోటు దక్కకపోవడం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. వార్మప్ మ్యాచ్ కాబట్టి తుది జట్టులో లేని ప్లేయర్లు కూడా ఆడాలనుకుంటే బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ చేయొచ్చు... కాబట్టి మహ్మద్ షమీతో బౌలింగ్ వేయించే అవకాశం ఉంది...

అలాగే తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన భారత యంగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్, స్పిన్నర్ యజ్వేంద్ర చాహాల్ కూడా కొద్దిసేపు ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఆడొచ్చు. అయితే ప్లేయింగ్ ఎలెవన్‌లో ఈ ముగ్గురికీ చోటు దక్కకపోవడం మాత్రం అభిమానులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది...

Image credit: PTI

ఐపీఎల్ 2022 టోర్నీ తర్వాత గాయపడి రెండు నెలల పాటు అంతర్జాతీయ క్రికెట్‌కి దూరంగా ఉన్నాడు కెఎల్ రాహుల్. అంతకుముందు ఈ ఏడాది ఒక్క అంతర్జాతీయ టీ20 మ్యాచ్ కూడా ఆడని కెఎల్ రాహుల్‌ని నేరుగా ఆసియా కప్‌లో ఆడించింది టీమిండియా. అది భారత జట్టుపై తీవ్రంగా ప్రభావం చూపింది...

Bumrah and Shami

మహ్మద్ షమీ విషయంలో కూడా అలాంటి ప్రయోగమే చేయనుంది భారత జట్టు. కెఎల్ రాహుల్ అంతకుముందు జింబాబ్వే టూర్‌లో వన్డే మ్యాచులు అయినా ఆడాడు. షమీ అంతర్జాతీయ మ్యాచులు ఆడి నాలుగు నెలలు అవుతోంది. జూలైలో ఇంగ్లాండ్ టూర్‌లో వన్డే సిరీస్‌లో పాల్గొన్నాడు షమీ... 

Latest Videos

click me!