పంజాబ్‌కి పట్టిన దరిద్రం ఏంటి... KKRvsKXIP మ్యాచ్‌పై ఫన్నీ మీమ్స్...

First Published Oct 10, 2020, 8:39 PM IST

IPL 2020 సీజన్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టును పరాజయాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఢిల్లీతో జరిగిన మొదటి మ్యాచ్‌లో సూపర్ ఓవర్‌లో ఓడిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్, నేటి మ్యాచ్‌లో కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌ మ్యాచ్‌లో జరిగిన ఉత్కంఠ మ్యాచ్‌లో 2 పరుగుల తేడాతో ఓడింది. గెలవాల్సిన మ్యాచ్‌లో చేజేతులా ఓడిన పంజాబ్‌పై ఫన్నీ మీమ్స్ పేలుతున్నాయి..

కెఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ అద్భుత ఇన్నింగ్స్‌లతో చెలరేగడంతో మ్యాచ్ వన్‌సైడ్ అవుతుందని అనిపించింది.
undefined
నికోలస్ పూరన్ అవుట్ కావడంతో మ్యాచ్‌లో ఉత్కంఠ మొదలైంది... 17 బంతుల్లో 21 పరుగులు కావాల్సిన స్టేజ్ నుంచి మ్యాచ్ మలుపు తిరిగింది.
undefined
ఆఖరి బంతికి 7 పరుగులు కావాల్సిన దశలో మ్యాక్స్‌వెల్ మ్యాగ్జిమమ్ సిక్సర్ కొట్టేందుకు ప్రయత్నించినా సిక్సర్ రాలేదు..
undefined
ఏడు మ్యాచుల్లో ఆరింట్లో ఓడిన పంజాబ్, ప్లేఆఫ్ చేరాలంటే అన్ని మ్యాచుల్లో గెలవాలి. అయినా మిగిలిన జట్ల విజయాలపై ఆధారపడాల్సి ఉంటుంది.
undefined
ఈ సీజన్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న కెఎల్ రాహుల్... ఏడు మ్యాచుల్లో ఒక్కటే విజయాన్ని అందుకున్నాడు.
undefined
సీజన్‌లో వరుసగా ఫెయిల్ అవుతూ వచ్చిన కేకేఆర్ కెప్టెన్ దినేశ్ కార్తీక్... నేటి మ్యాచ్‌లో మంచి కమ్ బ్యాక్ ఇచ్చాడు.
undefined
ఐపీఎల్ చరిత్రలో అతి తక్కువ తేడాతో ఓడిన రెండో మ్యాచ్ ఇది...
undefined
కెఎల్ రాహుల్ వికెట్ కీపింగ్ చేయకుండా ఆరెంజ్ క్యాప్ ప్రదర్శించడానికే మరో ప్లేయర్‌తో వికెట్ కీపింగ్ చేయిస్తున్నాడని ఆరోపణలు వస్తున్నాయి.
undefined
గత ఏడాది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును తగులుకున్న దరిద్రం, ఈ ఏడాది కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ను వెంటాడుతోంది.
undefined
17 బంతుల్లో 21 పరుగులు కావాల్సిన సమయంలో కేకేఆర్ ఫ్యాన్స్ కూడా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ‌యే గెలుస్తుందని అనుకున్నారు.
undefined
గెలవాల్సిన మ్యాచుల్లో కూడా జట్టు ఓడిపోతుండడంతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ యజమాని ప్రీతి జింటా బాధపడుతూ కనిపించింది.
undefined
ఆఖర్లో నడిచిన హైడ్రామాతో మ్యాచ్ ఒక్కసారిగా చేతులు మారింది...
undefined
ఒకానొక దశలో వికెట్ కోల్పోకుండా 115 పరుగులు చేసిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్, ఇంత ఘోరంగా ఓడుతుందని ఎవ్వరూ ఊహించలేదు.
undefined
ఈ ఏడాది కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ను దరిద్రం వెంటాడుతోంది..
undefined
ఆఖరి ఓవర్‌లో 14 పరుగులు కావాల్సిన దశలో సునీల్ నరైన్ ఓ వికెట్ తీసి 11 పరుగులే ఇచ్చాడు...
undefined
వరుస మ్యాచుల్లో ఓడుతున్నా... ‘యూనివర్సల్ బాస్’ క్రిస్‌గేల్‌ను ఆడించడం లేదు కింగ్స్ ఎలెవన్ పంజాబ్..
undefined
17 బంతుల్లో 21 పరుగులంటే... టీ20ల్లో చాలా సులువైన చేధన... కానీ అలాంటి పరిస్థితుల్లో సింగిల్స్ తీసి ఘోరంగా ఓడింది పంజాబ్..
undefined
మ్యాక్స్‌వెల్ కొట్టిన ఆఖరి షాట్... ఒక్క ఇంచ్ అటువైపు పడి ఉంటే... మ్యాచ్ టైగా ముగిసి సూపర్ ఓవర్‌కి దారి తీసేది...
undefined
వరుసగా ఫెయిల్ అవుతుండడంతో కెప్టెన్‌ను మార్చాలని దినేశ్ కార్తీక్‌పై విమర్శలు చేశారు చాలామంది. అయితే అద్భుతమైన కమ్ బ్యాక్‌తో అదరగొట్టాడు దినేశ్ కార్తీక్.
undefined
click me!