సన్‌రైజర్స్ నుంచి భువనేశ్వర్ ఒక్కడే... ఐపీఎల్ 2023లో అన్ని మ్యాచులు ఆడిన ప్లేయర్ల లిస్టులో..

Published : May 23, 2023, 08:14 PM IST

ఐపీఎల్ 2023 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 14 మ్యాచుల్లో 4 విజయాలే అందుకుని పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచింది. యాదృచ్ఛికంగా 2023 సీజన్‌లో గ్రూప్ స్టేజీలో అన్ని మ్యాచులు ఆడిన ప్లేయర్ల లిస్టులోనూ ఎస్‌ఆర్‌హెచ్ ఆఖరి స్థానంలో ఉంది..  

PREV
18
సన్‌రైజర్స్ నుంచి భువనేశ్వర్ ఒక్కడే... ఐపీఎల్ 2023లో అన్ని మ్యాచులు ఆడిన ప్లేయర్ల లిస్టులో..
PTI Photo)(PTI04_24_2023_000248B)

ఐపీఎల్ 2023 సీజన్‌లో గ్రూప్ స్టేజీలో 14 మ్యాచులు ఆడిన సన్‌రైజర్స్ హైదరాబద్ ప్లేయర్ భువనేశ్వర్ కుమార్ మాత్రమే. కెప్టెన్ అయిడిన్ మార్క్‌రమ్ కూడా తొలి మ్యాచ్‌కి అందుబాటులో లేకపోవడంతో ఆరెంజ్ ఆర్మీ ఈ లిస్టులో ఆఖరి స్థానంలో నిలిచింది..

28

చెన్నై సూపర్ కింగ్స్ నుంచి అత్యధికంగా ఏడుగురు ప్లేయర్లు, గ్రూప్ స్టేజీలో అన్ని మ్యాచులు ఆడారు. డివాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, ధోనీ, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అంబటి రాయుడు... గ్రూప్ స్టేజీలో అన్ని మ్యాచుల్లో తుది జట్టులో చోటు దక్కించుకున్నారు..

38

8వ స్థానంలో నిలిచిన పంజాబ్ కింగ్స్ నుంచి అర్ష్‌దీప్ సింగ్, రాహుల్ చాహార్, సామ్ కుర్రాన్, ప్రభుసిమ్రాన్ సింగ్, షారుక్ ఖాన్, జితేశ్ శర్మ 14 మ్యాచులు ఆడిన ప్లేయర్ల లిస్టులో నిలిచారు..

48

కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌ నుంచి వెంకటేశ్ అయ్యర్, సునీల్ నరైన్, నితీశ్ రాణా, ఆండ్రే రస్సెల్, రింకూ సింగ్, వరుణ్ చక్రవర్తి.. లీగ్ స్టేజీలో అన్ని మ్యాచులు ఆడారు...
 

58
Image credit: PTI

ముంబై ఇండియన్స్ నుంచి పియూష్ చావ్లా, టిమ్ డేవిడ్, కామెరూన్ గ్రీన్, ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ గ్రూప్ స్టేజీలో అన్ని మ్యాచులు ఆడారు...

68
(PTI Photo/Kunal Patil)(PTI05_12_2023_000262B)

గుజరాత్ టైటాన్స్ నుంచి మహ్మద్ షమీ, రషీద్ ఖాన్, వృద్ధిమాన్ సాహా, శుబ్‌మన్ గిల్, రాహుల్ తెవాటియా గ్రూప్ మ్యాచులన్నీ ఆడగా లక్నో సూపర్ జెయింట్స్ నుంచి ఆయుష్ బదోనీ, కృనాల్ పాండ్యా, నికోలస్ పూరన్, రవిభిష్ణోయ్, స్టోయినిస్ అన్ని మ్యాచులు ఆడారు..

78

ఆర్‌సీబీ నుంచి ఫాఫ్ డుప్లిసిస్, విరాట్ కోహ్లీ, గ్లెన్ మ్యాక్స్‌వెల్, సిరాజ్, హర్షల్ పటేల్ 2023 సీజన్‌లో 14 మ్యాచులు ఆడగా ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, డేవిడ్ వార్నర్ అన్ని మ్యాచులు ఆడారు...
 

88
PTI Photo/Swapan Mahapatra)(PTI05_11_2023_000307B)

ఐదో స్థానంలో నిలిచిన రాజస్థాన్ రాయల్స్ నుంచి జోస్ బట్లర్, హెట్మయర్, యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్, యజ్వేంద్ర చాహాల్ అన్ని మ్యాచులు ఆడారు.. 

click me!

Recommended Stories