ఐపీఎల్ 2021లో కుర్రాళ్ల కోసం పోటీ... సయ్యద్ ముస్తాక్ ఆలీలో మెరిసిన ఈ ప్లేయర్ల కోసం...

First Published Feb 2, 2021, 1:08 PM IST

పీఎల్ 2021 సీజన్ ఆరంభానికి ముందు సత్తా ఉన్న యువ క్రికెటర్లను గుర్తించేందుకు సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 టోర్నీని నిర్వహించింది బీసీసీఐ. ఈ టోర్నీ కోసమే ముందుగా ఫిబ్రవరి మొదటి వారంలో అనుకున్న ఐపీఎల్ మినీ వేలం... రెండు వారాలు వాయిదా పడింది. సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 టోర్నీలో సత్తా చాటిన కొందరు యువకుల కోసం ఫిబ్రవరి 18న చెన్నై వేదికగా జరిగే ఐపీఎల్ 2021 మినీ వేలంలో ఫ్రాంఛైజీల మధ్య మంచి పోటీ నడిచే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది...

మహ్మద్ అజారుద్దీన్ (కేరళ): సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 ట్రోఫీలో ముంబై బౌలర్లను ఓ ఆటాడుకుంటూ 137 పరుగుల భారీ సెంచరీ బాదాడు అజారుద్దీన్. 26 ఏళ్ల ఈ కేరళ బ్యాట్స్‌మెన్ టోర్నీలో 5 మ్యాచుల్లో 53.50 సగటుతో 214 పరుగులు చేశాడు.
undefined
ఓ మ్యాచ్‌లో డకౌట్ అయినా మనోడి స్ట్రైయిక్ రేటు దాదాపు 200 కావడంతో అజారుద్దీన్ కోసం ఐపీఎల్ మినీ వేలంలో ఫ్రాంఛైజీల మధ్య పోటీ భారీగా ఉండే అవకాశం ఉంది...
undefined
అజారుద్దీన్ ఐపీఎల్‌లో కోట్లు కొల్లగొట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదని మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ జోస్యం చెప్పాడం విశేషం...
undefined
ఎం. సిద్ధార్థ్: ఈ ఏడాది కేకేఆర్ విడుదల చేసిన ప్లేయర్ ఎం సిద్ధార్థ్. ఐపీఎల్ 2020 సీజన్‌లో బేస్ ప్రైజ్ రూ.20 లక్షలకు సిద్ధార్థ్ కొనుగోలు చేసిన కోల్‌కత్తా, అతన్ని రిజర్వు బెంచ్‌కే పరిమితం చేసింది. 2021 మినీ వేలానికి అతన్ని విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది కేకేఆర్.
undefined
సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 ఫైనల్ మ్యాచ్‌లో బరిలో దిగిన సిద్ధార్థ్... 4 ఓవర్లలో 20 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు తీశాడు. ఫైనల్‌లో ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు గెలిచిన మనిమరన్ సిద్ధార్థ్.. ఐపీఎల్ మినీ వేలంలో మంచి రేటు దక్కించుకోవడం పక్కా...
undefined
విష్ణు సోలంకి (బరోడా): సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 టోర్నీలో బరోడా ఫైనల్ చేర్చాడు విష్ణు సోలంకి. ఫైనల్‌ మ్యాచ్‌లో కూడా 49 పరుగులతో ఒంటరి పోరాడం చేసిన సోలంకి, ఐపీఎల్ మినీ వేలంలో మంచి ధర దక్కించుకునే అవకాశం ఉంది...
undefined
లుక్మన్ మెరివాలా (బరోడా): 29 ఏళ్ల లుక్మన్ మెరివాలా... సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 టోర్నీల్లో 8 మ్యాచుల్లో 15 వికెట్లు పడగొట్టాడు. ఛత్తీస్‌ఘడ్‌పై కేవలం 8 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు తీసిన మెరివాలా, ఐపీఎల్ 2021 సీజన్ ఆడే అవకాశం కచ్ఛితంగా కనిపిస్తోంది...
undefined
ఎం మహ్మద్ (తమిళనాడు): తమిళనాడుకి చెందిన ఎం మహ్మద్... 8 మ్యాచుల్లో 10 వికెట్లు పడగొట్టాడు. తమిళనాడు ప్రీమియర్ లీగ్ నుంచి సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 టోర్నీలో చోటు దక్కించుకున్న మహ్మద్, తన బౌలింగ్‌తో అందర్నీ ఆకట్టుకున్నాడు..
undefined
అశుతోష్ ఆమన్ (బీహార్): బీహార్‌కి చెందిన అశుతోష్ ఆమన్... ఐదు మ్యాచుల్లో 16 వికెట్లు తీసి సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 2021 సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. బీహార్‌కి కెప్టెన్‌గా వ్యవహారించిన ఈ స్పిన్నర్, ఐఏఎఫ్ అధికారి. కాబట్టి ఐపీఎల్ ఆడే అవకాశం ఉండకపోవచ్చు.
undefined
అరుణ్ కార్తీక్ (తమిళనాడు): రాజస్తాన్‌తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో 54 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 89 పరుగులు చేసి అదరగొట్టాడు అరుణ్ కార్తీక్. అంతేకాకుండా 10 క్యాచులు అందుకుని టోర్నీలో అత్యధిక క్యాచులు అందుకున్న ప్లేయర్‌గానూ నిలిచాడు..
undefined
కేదార్ దేవ్‌ధర్: కెప్టెన్ కృనాల్ పాండ్యా, తండ్రి మరణంతో సీజన్ మధ్యలో నిష్కమించడంతో బరోడా జట్టును నడిపించాడు కేదార్ దేవ్‌ధర్. ఓటమి లేకుండా బరోడాను ఫైనల్ చేర్చిన దేవ్‌ధర్... సీజన్‌లో అత్యధిక ఫోర్లు (35) బాదిన బ్యాట్స్‌మెన్‌గానూ నిలిచాడు...
undefined
click me!