IPL 2020: మన కుర్రాళ్లు అదరగొడుతున్నారు... సీజన్‌లో షైన్ అయిన యంగ్ ప్లేయర్లు వీరే...

Published : Oct 13, 2020, 05:26 PM IST

IPL 2020 సీజన్ తొలి సగం ముగిసింది. మొదట్లో భారీ స్కోరు నమోదైన ఈ సీజన్‌లో, ఆ తర్వాత పెద్ద స్కోర్లు నమోదుకాకుండా ఉత్కంఠభరిత మ్యాచ్‌లు మాత్రం జరుగుతున్నాయి. అయితే మిగిలిన సీజన్లతో పోలిస్తే ఈసారి యంగ్ ప్లేయర్లు అద్భుతంగా రాణిస్తున్నారు. ఇప్పటిదాకా షైన్ అయిన మన యంగ్ గన్స్ వీరే...

PREV
111
IPL 2020: మన కుర్రాళ్లు అదరగొడుతున్నారు... సీజన్‌లో షైన్ అయిన యంగ్ ప్లేయర్లు వీరే...

దేవ్‌దత్ పడిక్కల్: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓపెనర్‌గా మొదటి నాలుగు మ్యాచుల్లోనూ మూడు హాఫ్ సెంచరీలు చేసి సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు దేవ్‌దత్. ఈ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుత ప్రదర్శనలో పడిక్కల్‌కి కూడా భాగం ఉంది. 

211

రవి బిష్ణోయ్: అండర్ 19 వరల్డ్ కప్ జట్టు నుంచి నేరుగా ఐపీఎల్‌కి వచ్చిన రవి బిష్ణోయ్, సీజన్‌లో అద్భుతంగా రాణిస్తున్నాడు. ఇప్పటిదాకా జరిగిన 7 మ్యాచుల్లో 8 వికెట్లు తీశాడు రవి బిష్ణోయ్. హైదరాబాద్‌పై ఒకే మ్యాచుల్లో 3 వికెట్లు కూడా తీశాడు ఈ అండర్ 19 సెన్సేషన్. 

311

రాహుల్ తెవాటియా: రాజస్థాన్ రాయల్స్ జట్టుకి చెందిన రాహుల్ తెవాటియా, బెస్ట్ ఫినిషర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. 2020 సీజన్‌లో 7 మ్యాచుల్లో 189 పరుగులు చేసిన తెవాటియా, రెండు మ్యాచుల్లో జట్టుకి విజయాన్ని అందించాడు.  బౌలింగ్‌లో 5 వికెట్లు కూడా తీశాడు తెవాటియా.

411

రియాన్ పరాగ్: గత సీజన్‌ నుంచి ఐపీఎల్ ఆడుతున్న రియాన్, ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 42 పరుగులు చేశాడు. ఈ యంగ్ అస్సామీ మున్ముందు అదరగొడతాడని ఆశిస్తోంది రాజస్థాన్ రాయల్స్.

511

మహిపాల్ లోమ్రోర్: రాజస్థాన్ రాయల్స్ నుంచే వచ్చిన యంగ్ బ్యాట్స్‌మెన్ మహిపాల్ లోమ్రోర్. గత రెండు సీజన్లలో 2 మ్యాచులు మాత్రమే ఆడిన లోమ్రోర్, ఈ సీజన్‌లో 3 మ్యాచులు ఆడాడు. ఓ మ్యాచ్‌లో 47 పరుగులతో సత్తా చాటాడు.

611

సూర్యకుమార్ యాదవ్: 9 సీజన్లుగా ఐపీఎల్ ఆడుతున్నా, భారత జట్టులో చోటు సంపాదించుకోలేకపోయాడు సూర్యకుమార్ యాదవ్. ఈ సీజన్‌లో ఇప్పటిదాకా 7 మ్యాచులు ఆడిన సూర్యకుమార్ యాదవ్, 233 పరుగులు చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి.

711

ఇషాన్ కిషన్: ఐదు సీజన్లుగా ఐపీఎల్ ఆడుతున్న ఇషాన్ కిషన్, ఈ సీజన్‌లో అదరగొడుతున్నాడు. ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో 99 పరుగులతో ఇషాన్ కిషన్ ఆడిన ఇన్నింగ్స్ అతని కెరీర్ బెస్ట్ ఇన్నింగ్స్. 

811

ప్రియమ్ గార్గ్: అండర్ 19 కెప్టెన్‌గా జట్టును ఫైనల్ చేర్చిన ప్రియమ్ గార్గ్, తొలిసారి ఐపీఎల్ ఆడుతున్నా అదరగొడుతున్నాడు. 7 మ్యాచుల్లో 86 పరుగులు చేసిన ప్రియమ్ గార్గ్, చెన్నైపై ఓ అద్భుతమైన హాఫ్ సెంచరీ చేశాడు.

911

అభిషేక్ శర్మ: మూడు సీజన్లుగా ఐపీఎల్ ఆడుతున్నాడు అభిషేక్ శర్మ. అయితే ఈ సీజన్‌లో వరుస అవకాశాలు అందుకున్నాడు అభిషేక్. 7 మ్యాచుల్లో 63 పరుగులు చేసిన అభిషేక్, బౌలింగ్‌లో 2 వికెట్లు తీసుకున్నాడు.

1011

శివమ్ మావి: కోల్‌కత్తా నైట్‌రైడర్స్ జట్టు తరుపున ఆడుతున్న శివమ్ మావి, ఐదు మ్యాచుల్లో 5 వికెట్లు తీశాడు. అయితే మనోడి బౌలింగ్ విధానం అందర్నీ ఆకట్టుకుంటోంది.

1111

నాగర్‌కోటి: మూడేళ్ల క్రితమే ఐపీఎల్‌కు ఎంపికైనా, గాయాల కారణంగా టోర్నీలో పాల్గొనని యంగ్ స్టార్ కమ్లేశ్ నాగర్‌కోటి. ఈ సీజన్‌లో 6 మ్యాచులు ఆడిన నాగర్‌కోటి 4 వికెట్లే తీసుకున్నాడు. అయితే మనోడి యాక్షన్, ఫీల్డింగ్‌తో అందర్నీ తెగ ఇంప్రెస్ చేస్తున్నాడు.

click me!

Recommended Stories