Published : Jan 25, 2025, 08:05 PM ISTUpdated : Jan 25, 2025, 08:12 PM IST
ICC Men's T20I Cricketer of the Year: టీ20 క్రికెట్ లో అత్యధిక వికెట్లు తీసిన ప్లేయర్ గా కొనసాగుతున్న అర్ష్ దీప్ సింగ్.. స్టార్ ప్లేయర్లకు షాకిస్తూ ఐసీసీ పురుషుల T20I క్రికెటర్ ఆఫ్ ద ఇయర్‌గా ఎంపిక అయ్యాడు.
ICC Men's T20I Cricketer of the Year: గతేడాది భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసుకున్న రికార్డు కలిగిన అర్ష్ దీప్ సింగ్.. మొత్తంగా టీ20 క్రికెట్ లో అత్యధిక వికెట్లు తీసుకున్న భారత ప్లేయర్ గా కొనసాగుతున్నాడు. టీ20 ప్రపంచ కప్ 2024 ట్రోఫీని భారత్ గెలుచుకోవడంతో కీలక పాత్ర పోషించిన లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ 'ఐసీసీ పురుషుల టీ20 ఇంటర్నేషనల్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2024'గా ఎంపికయ్యాడు.
25
25 ఏళ్ల అర్ష్‌దీప్ గతేడాది అద్భుతమైన బౌలింగ్ తో అదరగొట్టాడు. 2024లో 18 మ్యాచ్‌లు ఆడి 36 వికెట్లు తీసుకున్నాడు. ఈ అవార్డును గెలుచుకునే రేసులో ఉన్న పాకిస్తాన్ స్టార్ బాబర్ ఆజం, ఆసీస్ స్టార్ క్రికెటర్ ట్రావిస్ హెడ్, సికందర్ రజాలకు షాకిస్తూ అర్ష్ దీప్ సింగ్ ఐసీసీ అవార్డును గెలుచుకున్నాడు.
35
ICC బెస్ట్ T20 ఇంటర్నేషనల్ టీమ్ ఆఫ్ ది ఇయర్ లో అర్ష్ దీప్ సింగ్
అర్ష్‌దీప్ సింగ్ కు ఈ అవార్డును గెలుచుకోవడం అతని కెరీర్‌లో మరో మైలురాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ తమ అంతర్జాతీయ కెరీర్‌లో ఈ అవార్డును అందుకోవాలని కలలుకంటారు. అలాగే, ICC బెస్ట్ T20 ఇంటర్నేషనల్ టీమ్ ఆఫ్ ది ఇయర్ లో అర్ష్ దీప్ సింగ్ చోటుదక్కించుకున్నాడు. భారత స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యాలతో పాటు అర్ష్‌దీప్ కూడా ICC బెస్ట్ T20 ఇంటర్నేషనల్ టీమ్ ఆఫ్ ది ఇయర్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు.
45
భారత్ టీ20 ప్రపంచకప్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన అర్హ్ దీప్ సింగ్
జూన్‌లో కరేబియన్ దీవులు, అమెరికా వేదికలుగా జరిగిన ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2024లో భారత్ ఛాంపియన్ గా నిలవడంతో అర్ష్ దీప్ సింగ్ కాలక పాత్ర పోషించాడు.
పవర్‌ప్లే, డెత్ ఓవర్లలో అద్భుత బౌలింగ్ తో భారత్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఈ ఎడమచేతి వాటం బౌలర్ 2022లో ఈ ఫార్మాట్‌లో భారత్ తరఫున అరంగేట్రం చేశాడు. అప్పటి నుండి అద్భుతంగా ప్రదర్శన ఇస్తున్నాడు. 2024లో అర్ష్‌దీప్ అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో ప్రపంచ స్థాయి బౌలర్‌గా నిలిచాడు. కొత్త బంతితో వికెట్లు తీయగల అతని సత్తా అందరినీ ఆకట్టుకుంది.
55
Image Credits: Twitter/BCCI
అద్భుతమైన ఫామ్‌లో ఉన్న అర్ష్‌దీప్ సింగ్
ప్రస్తుతం అర్ష్ దీప్ సింగ్ అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న టీ20 సిరీస్‌లో అర్ష్‌దీప్ సింగ్ కూడా ఉన్నాడు. కోల్‌కతా వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో చరిత్ర సృష్టించాడు. ఈ ఫార్మాట్‌లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు.
అర్ష్ దీప్ సింగ్ టీ అంతర్జాతీయ క్రికెట్ లో 98* వికెట్లు తీసుకున్నాడు. అంతకుముందు భారత్ తరఫున అత్యధిక టీ20 వికెట్లు తీసుకున్న బౌలర్ గా రికార్డు కలిగిన యుజ్వేంద్ర చాహల్‌ను అర్ష్ దీప్ సింగ్ అధిగమించాడు.