రోహిత్, బుమ్రాలకు దక్కని చోటు.. గౌతమ్ గంభీర్ ఆల్‌టైం ప్లేయింగ్ 11 లో ఎవరెవరు ఉన్నారంటే?

First Published | Sep 3, 2024, 11:35 AM IST

Gautam Gambhir All Time Playing 11 : టీం ఇండియా హెడ్ కోచ్, భారత జట్టు మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ తన ఆల్‌టైం ప్లేయింగ్ 11ని ప్రకటించారు. ఈ జట్టుకు ధోనీ కెప్టెన్‌గా, గంభీర్ వైస్ కెప్టెన్‌గా ఉన్నారు. జట్టులోని పూర్తి సభ్యుల వివరాలు ఇలా ఉన్నాయి.

Gautam Gambhir All Time Playing 11

Gautam Gambhir All Time Playing 11 : భారత జట్టు మాజీ ఓపెనర్, ప్రస్తుతం టీమిండియా ప్రధాన కోచ్ గా ఉన్న గౌతమ్ గంభీర్ తన ఆల్‌టైం ప్లేయింగ్ 11ని ప్రకటించారు. ఈ జట్టుకు భారత లెజెండరీ కెప్టెన్ ఎంఎస్ ధోనీని కెప్టెన్‌గా ఎంపిక చేశాడు. అయితే, భారత స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రాలకు గంభీర్ ప్లేయింగ్ 11లో చోటు దక్కించుకోలేకపోయారు.

గంభీర్ ఆల్‌టైం ప్లేయింగ్ 11లో వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్‌గా ఎంఎస్ ధోనీ చోటు దక్కించుకున్నారు. భారత జట్టులో అత్యుత్తమ వికెట్ కీపర్ మాత్రమే కాదు.. సక్సెస్‌ఫుల్ కెప్టెన్ కూడా. అన్ని ఐసీసీ వైట్ బాల్ టోర్నీల్లోనూ భారత జట్టుకు విజయాలు అందించారు. మూడు ఫార్మాట్లలో ధోని భారత జట్టును నెంబర్ వన్ గా నిలబెట్టాడు. 

గౌతమ్ గంభీర్ భారత జట్టు అనేక విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. మరీ ముఖ్యంగా ఐసీసీ ప్రపంచ కప్ లో అతను ఆడిన ఇన్నింగ్స్ లు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఐపీఎల్ లో సక్సెస్ ఫుల్ మెంటర్ గా కొనసాగిన గంభీర్ ఇప్పుడు భారత జట్టుకు ప్రధాన కోచ్ గా ఉన్నారు. 

Gautam Gambhir All Time Playing 11

ఓపెనింగ్ జోడిగా గౌతమ్ గంభీర్ తనతో పాటు వీరేంద్ర సెహ్వాగ్‌ను ఎంచుకున్నారు. టెస్ట్, వన్డే, టీ20ల్లో వీరి పాత్ర కీలకం. అనేక మ్యాచ్‌ల్లో అద్భుతంగా రాణించి జట్టుకు మంచి ఆరంభాన్ని అందించారు. వీరేంద్ర సెహ్వాగ్ భారత క్రికెట్ ను కొంత పుంతలు తొక్కించాడు. ఫార్మాట్ తో సంబంధం లేకుండా ధానధాన్ ఇన్నింగ్స్ లు ఆడి డాషింగ్ ఓపెనర్ గా గుర్తింపు సాధించాడు. 

వీరి తర్వాత మూడో స్థానంలో భారత జట్టు గోడగా పేరుగాంచిన రాహుల్ ద్రవిడ్ చోటు దక్కించుకున్నారు. భారత లెజెండరీ ప్లేయర్లలో ద్రవిడ్ ఒకరు. ప్లేయర్ గానే కాకుండా టీమిండియాకు ప్రధాన కోచ్ గా తన సేవలను అందించాడు. భారత్ ను ఛాంపియన్ గా నిలబెట్టారు.

రాహుల్ ద్రవిడ్ రిటైర్మెంట్ తర్వాత ఆ స్థానంలో స్థిరపడిపోయిన రన్ మిషన్, టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ  కి కూడా గంభీర్ జట్టులో చోటుదక్కింది. విరాట్ కోహ్లీ ప్రస్తుతం క్రికెట్ లో అత్యుత్తమ బ్యాటర్లలో ఒకరు. అనేక క్రికెట్ రికార్డులు బద్దలు కొట్టాడు. 

Latest Videos


Gautam Gambhir All Time Playing 11

నాలుగు, ఐదు స్థానాల్లో విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్‌లు చోటు దక్కించుకున్నారు. భారత జట్టులో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లుగా వీరిద్దరూ పేరుగాంచారు. క్రికెట్ దేవుడిగా పేరుగాంచిన సచిన్ టెండూల్కర్.. అంతర్జాతీయ క్రికెట్ హిస్టరీలో ఎప్పటికీ ఒక లెజెండ్. సచిన్ టెండూల్కర్ వన్డే, టెస్టు క్రికెట్ లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా రికార్డు సాధించాడు.

అలాగే, అంతర్జాతీయ క్రికెట్ లో అత్యధిక సెంచరీలు సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించి చాలా రోజులు అయినా సచిన్ ఫేమ్ ఇప్పటికీ తగ్గలేదు. టీమిండియా మ్యాచ్ జరిగితే చాలు సచిన్ సచిన్ అంటూ  ఒక్కసారైనా ఇప్పటికీ గ్రౌండ్ హోరెత్తుతుంది. 

Gautam Gambhir All Time Playing 11

స్పిన్ ఆల్‌రౌండర్‌గా యువరాజ్ సింగ్ ఆరో స్థానంలో చోటు దక్కించుకున్నారు. భారత జట్టులో అత్యుత్తమ ఆల్‌రౌండర్లలో యువీ ఒకరు. 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్ విజయాల్లో యువరాజ్ సింగ్ కీలక పాత్ర పోషించారు.

2007 ఐసీసీ టీ20 ప్రపంచ కప్ లో ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాది సరికొత్త రికార్డు సాధించాడు. ఇంగ్లాండ్ స్టార్ బౌలర్ స్టూవర్ట్ బ్రాడ్ వేసిన బౌలింగ్  లో ఒకే ఓవర్ లో యూపీ వరుసగా ఆరు సిక్సర్లు బాదాడు. 

ఆ తర్వాత గంభీర్ తన జట్టులో ఇర్ఫాన్ పఠాన్, జహీర్ ఖాన్‌లను పేసర్లుగా ఎంచుకున్నారు. ఈ ఇద్దరు ఎడచేతి వాటం పేసర్లు టెస్ట్, వన్డే, టీ20ల్లో జట్టుకు కీలక సేవలందించారు.

స్పిన్నర్లుగా అనిల్ కుంబ్లే, రవిచంద్రన్ అశ్విన్‌లను ఎంచుకున్నారు. టెస్ట్ క్రికెట్‌లో 619 వికెట్లు తీసి భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో ఒకరిగా కుంబ్లే నిలిచారు. వన్డేల్లోనూ కుంబ్లే అద్భుతమైన బౌలింగ్ తో సత్తా చాటారు.

టెస్ట్ క్రికెట్‌లో భారత్ తరఫున రెండో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ రవిచంద్రన్ అశ్విన్. కేవలం టెస్టుల్లోనే కాకుండా అన్ని ఫార్మాట్లలోనూ సత్తా చాటారు. 2011 ప్రపంచకప్ గెలిచిన జట్టులోనూ  అశ్విన్ సభ్యుడిగా ఉన్నారు. 

గౌతమ్ గంభీర్ ఆల్‌టైం ప్లేయింగ్ 11: వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్, రాహుల్ ద్రవిడ్, సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, యువరాజ్ సింగ్, ఎంఎస్ ధోనీ (వికెట్ కీపర్, కెప్టెన్), అనిల్ కుంబ్లే, రవిచంద్రన్ అశ్విన్, ఇర్ఫాన్ పఠాన్, జహీర్ ఖాన్.

click me!