ఏబీ డివిల్లియర్స్ రీఎంట్రీ కన్ఫార్మ్... విండీస్ టూర్‌లో ఆడతాడంటున్న గ్రేమ్ స్మిత్...

First Published May 7, 2021, 10:34 AM IST

‘మిస్టర్ 360’, ‘మిస్టర్ డిపెండబుల్’ ఏబీ డివిల్లియర్స్, అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించిన మూడేళ్ల తర్వాత రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఐపీఎల్ 2021 సీజన్‌లో కొన్ని అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడిన ఏబీడీని వెనక్కి రావాల్సిందిగా కోరింది సౌతాఫ్రికా క్రికెట్ జట్టు...

2019 వన్డే వరల్డ్‌కప్ ముందు ఆకస్మాత్తుగా అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు ఏబీ డివిల్లియర్స్ ప్రకటించడంతో అందరూ షాక్ అయ్యారు. ఏబీడీ రిటైర్మెంట్ తర్వాత సౌతాఫ్రికా క్రికెట్ జట్టు పర్ఫామెన్స్ దారుణంగా తయారైంది...
undefined
2019 వన్డే వరల్డ్‌కప్‌లో పసికూన ఆఫ్ఘాన్‌తో కూడా ఓడిన సౌతాఫ్రికా... ఆ తర్వాత వరుసగా సిరీస్‌లు ఓడితూ పేలవమైన ప్రదర్శన కనబరుస్తోంది. దీంతో ఏబీడీని రీఎంట్రీ ఇవ్వాల్సిందిగా కోరింది సఫారీ జట్టు.
undefined
2019 వన్డే వరల్డ్‌కప్ సమయంలోనే అవసరమైతే తాను ఆడతానని ప్రకటించాడు ఏబీ డివిల్లియర్స్. అయితే అప్పటికే పరిస్థితి చేయిదాటడంతో సఫారీ క్రికెట్ బోర్డు, ఏబీడీ ఆఫర్‌ను తిరస్కరించింది.
undefined
ఆ తర్వాత రోజురోజుకీ సౌతాఫ్రికా క్రికెట్ జట్టు పరిస్థితి దారుణంగా తయారవుతుండడంతో ఐపీఎల్ 2021 సీజన్‌కి ముందు ఏబీ డివిల్లియర్స్‌ కమ్‌బ్యాక్ చేయాలనుకుంటే డోర్లు తెరిచే ఉన్నాయంటూ ప్రకటించాడు సఫారీ క్రికెట్ కోచ్ మార్క్ బ్రౌచర్.
undefined
ఐపీఎల్ 2021 సీజన్ ముగిసిన తర్వాత తన రీఎంట్రీ గురించి ఆలోచిస్తానని ప్రకటించాడు ఏబీ డివిల్లియర్స్.
undefined
తాజాగా వెస్టిండీస్ టూర్‌లో ఆడబోయే 2 టెస్టులు, 5 టీ20లకు ప్రకటించిన జట్టులో ఏబీ డివిల్లియర్స్‌తో సీనియర్లు ఇమ్రాన్ తాహీర్, క్రిస్ మోరిస్‌లకు కూడా చోటు దక్కింది.
undefined
‘ఏబీ డివిల్లియర్స్, ఇమ్రాన్ తాహీర్, క్రిస్‌మోరిస్ విండీస్ టూర్‌లో పాల్గొంటారని ఆశిస్తున్నా... ’ అంటూ ప్రకటించాడు సౌతాఫ్రికా క్రికెట్ డైరెక్టర్, మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్..
undefined
ఈ ఏడాది జరగబోయే టీ20 వరల్డ్‌కప్‌లో ఏబీ డివిల్లియర్స్, క్రిస్ మోరిస్‌, డుప్లిసిస్, ఇమ్రాన్ తాహీర్, డి కాక్, కగిసో రబాడా, నోకియా వంటి టాప్‌ టీమ్‌తో బరిలో దిగాలని భావిస్తోంది సౌతాఫ్రికా క్రికెట్ జట్టు.
undefined
ఇప్పటికే ఐపీఎల్‌ 2021 సీజన్‌లో అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చిన ఈ ప్లేయర్లు, టీ20 వరల్డ్‌కప్‌లో సఫారీ టీమ్ తరుపున పాల్గొంటే టీమిండియాతో పాటు మిగిలిన అన్ని జట్లకు గట్టి పోటీ తప్పదు...
undefined
37 ఏళ్ల ఏబీ డివిల్లియర్స్, సౌతాఫ్రికా జట్టు తరుపున 114 టెస్టులు ఆడి 8765 పరుగులు చేశాడు. ఇందులో 22 సెంచరీలు ఉన్నాయి.
undefined
228 వన్డేల్లో 9577 పరుగులు చేసిన ఏబీడీ 25 సెంచరీలు సాధించాడు. 78 టీ20ల్లో 1672 పరుగులు చేసిన ఏబీ డివిల్లియర్స్, ఐపీఎల్‌లో డేవిడ్ వార్నర్ తర్వాత 5 వేల పరుగులు పూర్తిచేసుకున్న ఫారిన్ ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు.
undefined
click me!