లాక్ డౌన్: రూ. 1.7 లక్షల కోట్ల కరోనా ప్యాకేజీ, పేదలకు నిర్మలమ్మ ఆసరా

First Published | Mar 26, 2020, 7:00 PM IST

కరోనా కట్టడి చర్యల్లో భాగంగా దేశం మొత్తం లాక్‌డౌన్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉపాధి కోల్పోతున్న పేదలకు కేంద్ర ప్రభుత్వం ఆర్ధిక సాయాన్ని ప్రకటించింది. వలస కార్మికులు, పేదల కోసం రూ.1.7 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించారు ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్. 

ప్రభుత్వ శానిటేషన్ వర్కర్లు, ఆశావర్కర్లు, డాక్టర్లు, పారా మెడికల్ సిబ్బంది, తదితరులకు రూ. 50 లక్షల వైద్య బీమా
రూ. 15 వేల లోపు జీతం ఉన్న ఉద్యోగులకు ఈపీఎఫ్ చందాను కేంద్రమే చెల్లిస్తుంది. వంద మంది ఉద్యోగులకు ఉన్న సంస్థలకు మాత్రమే వర్తింపు.

వలస కార్మికులకు, పేదలకు నగదు బదిలీతో పాటు ఆహార పదార్థాల సరఫరా
వచ్చే మూడు నెలల పాటు ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన కింద పేదలకు బియ్యం లేదా గోధుమల పంపిణీ. ప్రతి ఒక్కరికీ ఐదు కిలోల చొప్పున ఉచితం.
ఉపాధి హామీ వేతనాలు రూ.182 నుంచి రూ.202కు పెంపు
స్వయం సహాయక బృందాలకు రుణ పరిమితి రూ.10 లక్షలకు పెంపు
సీనియర్ సిటిజన్లు, వితంతువులు, దివ్యాంగులకు వచ్చే మూడు నెలల పాటు రెండు విడతలుగా వేయి రూపాయల చొప్పున ఇస్తారు.
జన్ ధన్ బ్యాంకు ఖాతాలు ఉన్న 20 కోట్ల మహిళల ఖాతాల్లో వ్చేచ మూడు నెలల పాటు ప్రతి నెల రూ.500 నగదు జమ
ఉజ్వల ఫథకం కింద లబ్ధిదారులకు ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు
రైతు ఖాతాల్లో నేరుగా రూ. 2 వేల చొప్పున జమ. 8.69 మంది రైతులకు ప్రయోజనం

Latest Videos

click me!