ఎండాకాలంలో పెట్రోల్ ధరలు తగ్గుతాయి: పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌

Arun Kumar P   | Asianet News
Published : Mar 02, 2021, 11:29 AM IST

దేశవ్యాప్తంగా గత కొన్ని రోజులుగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు చుక్కలను తాకుతున్నాయి. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో పెట్రోల్ ధరలు సెంచరీ కొట్టేశాయి. దీంతో వాహనదారులు బండెక్కాలంటేనే భయపడుతున్నారు.పెరిగిన ధరలను తగ్గించాలంటూ ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు నిరసనలు చేపట్టాయి.  అటు జనం సైతం ప్రభుత్వాలు ధరలు తగ్గిస్తాయా అని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శీతాకాలం పోతే పెట్రోల్‌ ధరలు దిగివస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతి ఏటా శీతాకాలంలో డిమాండ్‌ అధికంగా ఉంటుంది కాబట్టి చలి కాలం పూర్తయితే ధరలు తగ్గుతాయని ధర్మేంద్ర ప్రధాన్ వివరించారు. 

PREV
ఎండాకాలంలో పెట్రోల్ ధరలు తగ్గుతాయి: పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌

cartoon punch

cartoon punch

click me!

Recommended Stories