గుంటూరు: విద్యాబుద్దులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడే బుద్దితప్పాడు. చదువు చెప్పాల్సిన తరగతి గదిలోనే చిన్నారులతో నీచంగా వ్యవహరించాడు. అభం శుభం తెలియని బాలికలకు బూతు సినిమాలు చూపిస్తూ వారితో అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా సత్తెనపల్లి పట్టణంలోని శాలివాహన నగర్ ఎంపిపిఎస్(ఉర్దూ) పాఠశాల వెలుగుచూసింది.