అమరావతి: ఇవాళ (సోమవారం) విడుదలైన ఆంధ్ర ప్రదేశ్ పదో తరగతి పరీక్షా పలితాల్లో అమ్మాయిలు అద్భుతాలు చేసారు. ఓవరాల్ గా ఫలితాలను చూస్తే 67.20 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇందులో బాలికల ఉత్తీర్ణ శాతం 70.70 గా వుంటే అబ్బాయిల్లో 64.02 శాతంగా ఉంది. జిల్లాలవారిగా చూసుకుంటే అత్యధిక ఉత్తీర్ణత శాతంతో ప్రకాశం టాప్ లో వుండగా అత్యల్ప ఉత్తీర్ణత శాతంతో అనంతపురం జిల్లా ఆఖర్లో నిలిచింది.