హైదరాబాద్: నిత్యావసరాల ధరలు అంతకంతకూ పెరుగుతూ సామాన్య, మధ్యతరగతి, నిరుపేద కుటుంబాలపై మోయలేని భారాన్ని మోపుతున్నాయి. గూడు, గుడ్డే కాదు కూడు కూడా సామాన్యుడికి అందుబాటు ధరల్లో వుండటంలేదు. ఇప్పటికే వంటనూనెల ధరలు భారీగా పెరగ్గా ఇప్పుడు ఎండల మాదిరిగానే కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. కనీసం పప్పు వండుకుని తిందామంటే వాటి ధరలు భారీగానే వున్నాయి. దీంతో కుటుంబానికి ఒక్కపూట తిండి అందించాలంటేనే సామాన్యుడి జేబుకు చిల్లుపడుతోంది.