తెలుగు సినీపరిశ్రమను, అభిమానులను ధుఖ: సాగరంలో నెట్టి సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ ఇవాళ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. నిన్న (సోమవారం) హైదరాబాద్ లోని ఇంట్లో వుండగా ఒక్కసారిగా గుండెపోటుకు గురయిన కృష్ణను కుటుంబసభ్యులు కాంటినెంటల్ హాస్పిటల్ కు తరలించారు. అక్కడ మెరుగైన వైద్యం అందించినా కృష్ణ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడకుండా ఇవాళ (మంగళవారం) తుదిశ్వాస విడిచారు.