హైదరాబాద్: ప్రశాంత్ కిషోర్... తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశ రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు. రాజకీయ వ్యూహకర్తగా ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో వివిధ పార్టీలను గెలిపించి పీకే ఇక ఏకంగా ఏనుగు కుంభస్తలాన్నే కొట్టాలని చూస్తున్నాడు. గతంలో తన వ్యూహాలతో కేంద్రంలో బిజెపి అధికారంలోకి రావడానికి సహకరించిన ఆయన ఈసారి కాంగ్రెస్ పార్టీకి పనిచేసేందుకు సిద్దమైనట్లు సమాచారం. ఇలా ఒక్కోటిగా రాజకీయ పార్టీలన్నింటిని తన కంట్రోల్ లోకి తీసుకుంటున్నారు పీకే.