హైదరాబాద్: అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో ముడిచమురు ధరలు గరిష్ట స్థాయికి చేరుకోవడంతో దేశంలో పెట్రోల్, డిజిల్ ధరల పెంపు కొనసాగుతూనే వుంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత దేశ ప్రజలపై పెట్రోల్, డిజిల్ బాదుడు మరింత ఎక్కువయ్యింది. ఇవాళ(బుధవారం) కూడా పెట్రోల్, డిజిల్ రేట్లు పెరిగాయి. తాజా పెంపుతో హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ. 114.50, లీటర్ డీజిల్ రూ. 100.69కు చేరకుంది.