మహారాష్ట్రలో ప్రస్తుతం వాడివేడి రాజకీయాలు కొనసాగుతున్నాయి. దశాబ్దాల బిజెపితో బంధాన్ని తెంచుకుని అధికారాన్నే కాదు సీఎం పదవిని దక్కించుకున్న శివసేన ఇప్పుడు రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. మంత్రి ఏక్ నాథ్ షిండే నేతృత్వంలో దాదాపు 40మంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే పై తిరుగుబాటు చేసారు. దీంతో సీఎం పదవినే కాదు పార్టీపై పట్టును కూడా కోల్పోయే ప్రమాదంలో పడ్డారు ఉద్దవ్. ఇక శివసేన. ఎన్సీపి, కాంగ్రెస్ కూటమితో ఏర్పాటైన మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం పతనం అంచుకు చేరుకుంది. మహారాష్ట్రలో జరుగుతున్న పరిణామాల వెనక బిజెపి వుందనేది అందరికీ తెలిసిందే.