హైదరాబాద్: నగరాలు, పట్టణాల్లోనే కాదు మారుమూల గ్రామాల్లోనూ సామాన్యుల నుండి సంపన్నుల వరకు ప్రతిఒక్కరూ గ్యాస్ నే వినియోగిస్తున్నారు. ఇలా పూర్తిగా గ్యాస్ పైనే ఆదారపడిన ప్రజలపై చమురు కంపనీలు షాక్ మీద షాక్ ఇస్తున్నాయి. ఇప్పటికే వెయ్యి రూపాయిలు దాటిన ఎల్పీజి గ్యాస్ సిలిండర్ ధర తాజాగా మరో 50రూపాయలు పెరిగింది. దీంతో గ్యాస్ సిలిండర్ ధర రూ. 1052కు చేరింది. పెరిగిన ధరలు ఇప్పటికే అమల్లోకి వచ్చాయి. పెట్రోల్, డీజిల్ ధరలతో ఇప్పటికే ఇబ్బంది పడుతున్న ప్రజలకు.. పెరిగిన గ్యాస్ సిలిండర్ మరింత భారంగా మారింది.