హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు దసరా షాపింగ్ లో మునిగిపోతే కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో మాత్రం ప్రధాన పార్టీలన్ని ఓట్ల షాపింగ్ చేస్తున్నారు. హుజురాబాద్ ఉపఎన్నిక నేపథ్యంలో ప్రజల మనసు గెలుచుకుని మరోసారి ఎమ్మెల్యే పదవి దక్కించుకోవాలని ఈటల రాజేందర్, మొదటిసారి ఎమ్మెల్యే కావాలని గెల్లు శ్రీనివాస్ యాదవ్, బల్మూరి వెంకట్ ప్రయత్నిస్తున్నారు.