నేడు(మంగళవారం) రంగుల పండగ హోళీని ప్రజలంతా ఘనంగా జరుపుకుంటున్నారు. చిన్నాపెద్ద తేడాలేకుండా ఒకరికొరు రంగులు పూసుకుంటూ ఆనందిస్తున్నారు. నిత్యజీవితంలో వుండే కష్టాలను మరిచి చిన్నపిల్లలుగా మారిపోయిన పెద్దలు, కల్మశమన్నదే ఎరగని చిన్నారులు, యువతీ యువకులు... ఇలా ప్రతిఒక్కరు హోలీ రంగుల్లో మునిగి తేలుతున్నారు. ఇలా రంగుల పండగ హోళీ తెలుగు లోగిళ్లలో సంబరాలను తీసుకువచ్చింది.