ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం రోజురోజుకు పెరుగుతోంది. దీంతో ఎలక్ట్రిక్ వెహికిల్స్ మార్కెట్ బాగా వృద్దిచెందుతోంది... భవిష్యత్ లో ఇది ఊహించని స్థాయికి చేరుకుంటుందని మార్కెట్ నిపుణుల అంచనా. ఈ ఎలక్ట్రిక్ వాహనాలు రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తోంది.
ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరగడం పర్యావరణానికి చాలా మేలుచేసే అంశం. అంతేకాదు ఇందన ఖర్చులు తగ్గి ఆర్థికభారం తగ్గుతుంది. కాబట్టి ప్రభుత్వాలు కూడా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహిస్తోంది.
ముఖ్యంగా ఎలక్ట్రిక్ కార్ల వినియోగం బాగా పెరుగుతోంది. ఎలక్ట్రిక్ SUV లు ఆధునిక ఫీచర్లతో మార్కెట్ లోకి వస్తున్నాయి... కొన్ని కార్లలో ఒక్కసారి పూర్తిగా చార్జింగ్ చేస్తే 500 కి.మీ. కంటే ఎక్కువ దూరం ప్రయాణించవచ్చు. ఇలాంటి టాప్ ఎలక్ట్రిక్ SUV కార్ల గుర్తించి తెలుసుకుందాం.