ఈ నెెలలో భారీ డిస్కౌంట్ తో టాప్ 6 కార్లు : రూ.2.5 లక్షల వరకు తగ్గింపు

First Published | Sep 5, 2024, 8:06 PM IST

కొత్త కారు కొనాలనుకునే వారికోసం ఈ నెల (సెప్టెంబర్)  శుభవార్త తీసుకొచ్చింది. ఈ నెలలో మారుతి సుజుకి తన అద్భుతమైన కార్లపై రూ.2.50 లక్షల వరకు తగ్గింపును అందిస్తోంది. ఏ కారుపై ఎంత తగ్గింపు ఉందో తెలుసుకుందాం...

మారుతి జిమ్నీపై రూ.2.50 లక్షల తగ్గింపు

ఈ నెలలో (సెప్టెంబర్‌ 2024) మీరు మారుతి సుజుకి జిమ్నీని కొనుగోలు చేస్తే రూ.2.50 లక్షల వరకు ఆదా చేయవచ్చు. జిమ్నీ టాప్ వేరియంట్ ఆల్ఫాపై ఈ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. జీటా వేరియంట్‌పై రూ.1.95 లక్షల వరకు తగ్గింపు లభిస్తోంది. ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ.12.74 లక్షల నుండి రూ.14.95 లక్షల వరకు ఉంది. దీని మైలేజీ లీటరుకు 16.94 కి.మీ.

మారుతి గ్రాండ్ విటారా

ఈ SUVపై సెప్టెంబర్ లో రూ.1.28 లక్షల వరకు తగ్గింపును అందిస్తోంది కంపనీ.  ఇది స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌పై అందుబాటులో ఉంది. అంతేకాకుండా, మైల్డ్ హైబ్రిడ్ వేరియంట్‌పై రూ.73,000, CNG వేరియంట్‌పై రూ.33,000 వరకు తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు.


మారుతి బలెనో

మీరు మారుతి బలెనో కొనాలని అనుకుంటున్నారా? అయితే సెప్టెంబర్ 2024 లోనే ఆ పని చేయండి. ఈ నెలలోనే కొనడం ద్వారా రూ.52,000 వరకు ఆదా చేసుకోవచ్చు. బలెనో ఆటోమేటిక్ మోడల్‌పై ఈ తగ్గింపు అందుబాటులో ఉంది. మాన్యువల్ మోడల్‌పై రూ.47,100, CNG మోడల్‌పై రూ.37,100 తగ్గింపు లభిస్తోంది.

మారుతి XL6పై కూడా తగ్గింపు

మారుతి సుజుకి తన XL6 పెట్రోల్ వేరియంట్‌పై సెప్టెంబర్ నెలలో రూ.35,000 తగ్గింపును అందిస్తోంది. అయితే CNG మోడల్‌ను కొనుగోలు చేస్తే రూ.25,000 వరకు ఆదా చేసుకోవచ్చు.

మారుతి సియాజ్

మారుతి సియాజ్‌పై కంపెనీ రూ.45,000 వరకు తగ్గింపును అందిస్తోంది. ఇందులో రూ.20,000 నగదు తగ్గింపు,  రూ.25,000 ఎక్స్ఛేంజ్ బోనస్ ఉన్నాయి.

మారుతి ఇగ్నిస్

మారుతి ఇగ్నిస్ కొనుగోలుపై ఈ నెలలో రూ.53,100 తగ్గింపు లభిస్తోంది. ఈ ఆఫర్ ఆటోమేటిక్,  సిగ్మా వేరియంట్లపై అందుబాటులో ఉంది. మాన్యువల్ వేరియంట్లపై రూ.48,100 తగ్గింపు లభిస్తోంది.

Latest Videos

click me!