
Top 10 Selling Cars in 2025 : ఒకప్పుడు కారు అనేది లగ్జరీ... కానీ ప్రస్తుతం ఇది నిత్యావసరంగా మారిపోయింది. మారుతున్న కాలాన్ని బట్టి మనిషి అవసరాలు కూడా మారుతున్నాయి... ఈ క్రమంలోనే కారు నిత్యావసరాల్లో చేరిపోయింది. తమ కుటుంబం కోసం కొందరు... స్టేటస్ కోసం ఇంకొందరు... ఉద్యోగ, వ్యాపార అవసరాల కోసం మరికొందరు కార్లను కొనుగోలు చేస్తున్నారు. గతంలో బైక్స్ మాదిరిగా ఇప్పుడు కార్లు మారాయి.
కార్ల తయారీ కంపనీల మధ్య పోటీ పెరిగింది...దీంతో తమ వాహనాల సేల్ పెంచుకునేందుకు అనేక ఆఫర్లు ప్రకటిస్తున్నారు. ఇలా జీరో డౌన్ పేమెంట్, ఈజీ ఈఎంఐ ఆప్షన్, తక్కువ ధరకే అందిస్తుండటంతో కార్ల అమ్మకాలు భారీగా జరుగుతున్నాయి. వినియోగదారులు తమకు నచ్చిన కారును కొనేందుకు ఏమాత్రం వెనకాడటం లేదు.
ఇలా గతేడాది భారీగా కార్లు అమ్ముడుపోయాయి. ఈ ఏడాది (2025) కేవలం ఒక్క నెల మాత్రమే ముగిసింది... రెండో నెల కూడా పూర్తికాలేదు. అప్పుడు లక్షలాది కార్లు అమ్ముడుపోయాయి. ఏ కంపనీ, ఏ మోడల్, ఎన్ని కార్లు అమ్ముడుపోయాయో వివరాలు వచ్చాయి. ఇలా జనవరి 2025 లో అమ్ముడుపోయిన టాప్ 10 కార్లు ఏవో తెలుసుకుందాం.
జనవరి 2025 లో అత్యధికంగా అమ్ముడుపోయిన టాప్ 10 కార్లు :
1. మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ (Maruti Suzuki Wagon R) :
గత నెల జనవరిలో అత్యధికంగా అమ్ముడుపోయిన కార్లలో మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ టాప్ లో నిలిచింది. చాలాకాలంగా మార్కెట్ లో ఉన్న ఈ మోడల్ సామాన్య, మధ్యతరగతి ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంటోంది... మిడిల్ క్లాస్ కారుగా గుర్తింపుపొందింది. గతేడాది 2024 లో రికార్డు స్థాయిలో ఈ మోడల్ అమ్ముడుపోయింది... ఈ రికార్డును ఈ ఏడాది 2025 లో కూడా కొనసాగిస్తోంది. జనవరి 2025 లో ఏకంగా 24,078 వ్యాగన్ ఆర్ కార్లు అమ్ముడుపోయాయి.
ఎక్స్ షోరూమ్ ధర : రూ.5.54 - 7.33 లక్షలు
2. మారుతి సుజుకి బలేనో (Maruti Suzuki Baleno) :
జనవరి 2025 లో అత్యధికంగా అమ్ముడుపోయిన వాహనాల్లో రెండో స్థానం కూడా మారుతిదే. మారుతి సుజుకి బలేనో మోడల్ కార్లు గత నెలలో 19,965 అమ్ముడుపోయి రికార్డు సృష్టించాయి. భారత అటోమోటివ్ రంగంలో బలేనోకు ప్రత్యేక గుర్తింపు ఉంది... ఇదికూడా సామాన్యులకు బాగా దగ్గరైన కారు.
ఎక్స్ షోరూమ్ ధర : రూ.6.66 - 9.84 లక్షలు
3. హ్యుందాయ్ క్రెటా (Hyundai Creta) :
భారతదేశంలో అత్యధికంగా అమ్ముడుపోతున్న SUV కార్లలో హ్యుందాయ్ క్రెటా టాప్ లో ఉంది. మొత్తంగా చూసుకుంటే హ్యుందాయ్ కార్లలో అధిక డిమాండ్ ఉన్న కారు ఇదే. గత నెల జనవరి 2025 లో 18,522 క్రెటా కార్లు అమ్ముడుపోయాయి.
ఎక్స్ షోరూమ్ ధర : రూ.11 - 20.30 లక్షలు
4. మారుతి సుజుకి స్విప్ట్ (Maruti Suzuki Swift) :
మారుతి సుజుకి లో టాప్ సేల్స్ కలిగిన కార్లలో స్విప్ట్ ఒకటి. 2005 లో విడుదలైన ఈ కారు గత 20 ఏళ్లుగా మార్కెట్ లీడర్ గా నిలుస్తోంది... రెండు దశాబ్దాలుగా ఇంత నిలకడగా సేల్స్ ఉండటం మామూలువిషయం కాదు. జనవరి 2025 లో కూడా ఈ స్విప్ట్ మోడల్ 17,081 విక్రయించబడ్డాయి.
ఎక్స్ షోరూమ్ ధర : రూ.6.49 - 9.59 లక్షలు
5. టాటా పంచ్ (TATA Punch) :
ఇటీవల కాలంలో మార్కెట్ లోకి వచ్చిన కార్లలో వినియోగదారులకు బాగా నచ్చినవాటిలో టాటా పంచ్ ఒకటి. 2021 లో మార్కెట్ లోకి వచ్చిన ఈ కారు బాగా సక్సెస్ అయ్యింది. కేవలం జనవరి 2025 అంటే ఒక్క నెలలోనే 16,231 టాటా పంచ్ కార్లు అమ్ముడుపోయాయి.
ఎక్స్ షోరూమ్ ధర : రూ.6.13 - 10.15 లక్షలు
6. మారుతి సుజుకి గ్రాండ్ విటారా (Maruti Suzuki Grand Vitara) :
మారుతి సుజుకి నుండి వచ్చిన మరో అద్భుతమైన కారు గ్రాండ్ విటారా. అద్భుతమైన లుక్, మంచి ఫర్ఫార్మెన్స్ కలిగిన ఈ కారు అత్యధికంగా అమ్ముడుపోయేవాటి జాబితాలో ఉంది. జనవరి 2025 లో 15,784 గ్రాండ్ విటారా కార్లు అమ్ముడుపోయాయి.
ఎక్స్ షోరూమ్ ధర : రూ.11.19 - 20.09 లక్షలు
7. మహింద్రా స్కార్మియో (Mahindra Scorpio) :
ఒకప్పుడు ఆటోమోటివ్ రంగాన్ని ఏలిన కార్లలో మహింద్రా స్కార్పియో ఒకటి. ఇటీవల ఈ కారు సరికొత్త హంగులతో మళ్ళీ మార్కెట్ లోకి వచ్చింది. రాజసం ఉట్టిపడేలా గ్రాండ్ లుక్ కలిగిన ఈ SUV ఎంతగానో ఆకట్టుకుంటోంది. జనవరి 2025 లో ఈ న్యూ స్కార్పియో 15,442 యూనిట్లు అమ్ముడుపోయాయి.
ఎక్స్ షోరూమ్ ధర : రూ.13.62 - 17.42 లక్షలు
8. టాటా నెక్సాన్ (TATA NEXON) :
టాటా నుండి వచ్చిన మరో ఫ్యామిలీ కారు టాటా నెక్సాన్. మంచి ఔట్ లుక్ తో, అత్యాధునిక ఫీచర్లతో మార్కెట్ లోకి వస్తూనే తన మార్క్ చూపించింది. గత జనవరి 2025 ఏకంగా 15,397 టాటా నెక్సాన్ కార్లు అమ్ముడుపోయాయి.
ఎక్స్ షోరూమ్ ధర : రూ.8 - 15.50 లక్షలు
9. మారుతి సుజుకి స్విప్ట్ డిజైర్ (Maruti Suzuki Swift DZIRE) :
సెడాన్ విభాగంలో అత్యధికంగా అమ్ముడుపోతున్న కార్లలో మారుతి సుజుకి డిజైర్ టాప్ లో ఉంటుంది. గత జనవరి 2025 లో ఈ స్విప్ట్ డిజైర్ 15,383 యూనిట్లు అమ్ముడుపోయాయి.
ఎక్స్ షోరూమ్ ధర : రూ.6.57 - 9.34 లక్షలు
10. మారుతి సుజుకి ఫ్రాంక్స్ (Maruti suzuki fronx) :
మారుతి సుజుకి నుండి వచ్చిన మరో మోడల్ ఫ్రాంక్స్ కూడా మార్కెట్ లో మంచిస్థానమే సాధించింది. జనవరి 2025 లో 15,192 ఫ్రాంక్స్ కార్లు అమ్ముడుపోయాయి.
ఎక్స్ షోరూమ్ ధర : రూ.7.51 - 13.04 లక్షలు