పవర్ ఫుల్ ఇంజన్, ఐఆర్ఎ టెక్నాలజీతో కొత్త టాటా ఆల్ట్రోజ్.. 27 కనెక్ట్ కార్ ఫీచర్స్ కూడా..
First Published | Jan 23, 2021, 5:01 PM ISTదేశంలోని ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ టాటా మోటార్స్ నుండి వస్తున్న ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కారు ఆల్ట్రోజ్ ఐటర్బోను భారతదేశంలో విడుదల చేసింది. కొన్ని రోజుల క్రితం కంపెనీ ఈ కారును ఆవిష్కరించింది, కానీ దాని ధర ఇప్పుడు వెల్లడైంది. టాటా ఐఆర్ఎ (ఇంటెలిజెంట్ రియల్ టైమ్ అసిస్ట్) టెక్నాలజీతో అల్ట్రాజ్ టర్బో ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌ను కంపెనీ ప్రవేశపెట్టింది. ఐఆర్ఎ టెక్నాలజీ సహాయంతో కారు డ్రైవర్లు 27 కనెక్ట్ చేయబడిన కార్ ఫీచర్లను ఉపయోగించగలరు. ఈ టెక్నాలజీకి సంబంధించిన ప్రత్యేకత ఏమిటంటే, దీని ద్వారా మీరు కారును హిందీ లేదా ఇంగ్లీషులో కమాండ్ ఇవ్వవచ్చు. టాటా మోటార్స్ ఇప్పటికే కొత్త ఆల్ట్రోజ్ ఐటర్బో ప్రీ-బుకింగ్‌ను అధికారికంగా ప్రారంభించింది. కేవలం 11,000 రూపాయలు చెల్లించి అల్ట్రాజ్ ఐ టర్బో కారుని బుకింగ్ చేసుకోవచ్చు. కొత్త ఆల్ట్రోజ్ ఐటర్బో కొత్త పవర్‌ట్రెయిన్‌లు, అప్‌డేటెడ్ ఫీచర్‌లతో పాటు కొత్త కలర్ థీమ్‌తో పరిచయం చేశారు.