కారులో కరోనా సంక్రమణ ప్రమాదాన్ని తెలుసుకోవడానికి, మసాచుసెట్స్ విశ్వవిద్యాలయానికి చెందిన భౌతిక శాస్త్రవేత్త వర్గీస్ మథాయ్, బ్రౌన్ విశ్వవిద్యాలయంలోని అతని ముగ్గురు సహచరులు అసిమన్‌షుదాస్, జెఫ్రీ బెయిలీ, కెన్నెత్ బ్రూయెర్ కారులో వైరస్ వ్యాప్తిని ఎలా తగ్గిచాలో తెలుసుకోవడానికి ప్రయత్నించారు.
డ్రైవర్ సీటు కిటికీ తెరిచి ఉంచినట్లయితే కారులో వెనుక సీటు కిటికీ కూడా తెరచి ఉంటే సంక్రమణ ప్రమాదం తగ్గుతుంది. డ్రైవర్ అలాగే వెనుక సీటు కూర్చున్న వ్యక్తికి ప్రమాదం కూడా తగ్గుతుంది.
పోర్ట్ ల్యాండ్ స్టేట్ యూనివర్శిటీలోని ఎయిర్ క్వాలిటీ ఎక్స్‌పర్ట్ రిచర్డ్ కోర్సీ వివిధ పరిస్థితులలో శ్వాస ద్వారా ఒక వ్యక్తి శరీరం లోపలికి వెళ్ళే ఏరోసోల్‌లను కొలవడానికి ఒక నమూనాను అభివృద్ధి చేశాడు. స్కూల్ తరగతి లేదా రెస్టారెంట్‌లో కరోనా సోకిన వ్యక్తితో గంట సేపు కూర్చోవడం కంటే సోకిన వ్యక్తితో 20 నిమిషాలు కారులో ప్రయాణించడం చాలా ప్రమాదకరమని వారు కనుగొన్నారు. ఎందుకంటే కారుకు వెంటిలేషన్ ఉండదు కాబట్టి.
ఫాలి-అప్ అధ్యయనంలో కారు నాలుగు కిటికీలు సగం తెరిస్తే కూడా అది మొత్తం కిటికీలను తెరిచినంత ప్రభావవంతంగా ఉంటుందని తేలింది. మథాయ్ ప్రకారం, కనీసం రెండు వ్యతిరేక కిటికీలు కూడా తెరిస్తే కోరనా వైరస్ సంక్రమణ ప్రమాదాన్ని తగ్గించవచ్చు. ఇది కూడా ఒక సమర్థవంతమైన పరిష్కారం అని తెలిపారు.
నాలుగు కిటికీలు మూసివేస్తే, ప్రమాదం అత్యధికం.ఏరోసోల్ కదలికను తెలుసుకోవడానికి పరిశోధకులు కారు లోపల గాలి ప్రవాహాన్ని కొలుస్తారు. ఇందుకోసం కారు కిటికీలు తెరిచి వేర్వేరు కాంబినేషన్‌లో మూసివేశారు. నాలుగు కిటికీలు మూసివేసినప్పుడు గాలి ప్రవాహం అతి తక్కువగా ఉంటుందని పరిశోధకులు కనుగొన్నారు. ఈ పరిస్థితిలో కరోనా సంక్రమణ ప్రమాదం ఎక్కువగా ఉంటుందని దీని అర్థం.
కరోనా సోకిన వారితో కారులో 20 నిమిషాలు ప్రయాణించడం కూడా ప్రమాదకరం,పరిశోధకులు గంటకు 80 కిలోమీటర్ల వేగంతో నడుస్తున్న కారును అధ్యయనం చేశారు. దీనిలో ముందు వైపు డ్రైవర్, కుడి వైపున వెనుక సీట్లో ప్రయాణీకుడు ఉన్నారు. ఈ విధంగా కారులో భౌతిక దూరం సరిపోతుంది. కదిలే కారు లోపల కదిలే గాలి కారు లోపల ఒత్తిడిని సృష్టిస్తుందని కనుగొన్నారు. గాలి ఒత్తిడి వెనుక వైపు కంటే ముందు భాగంలో తక్కువగా ఉంటుంది.