ఇండియన్ మార్కెట్లోకి మళ్ళీ డీజిల్ కార్ల ఎంట్రీ.. 1.5 లీటర్ ఇంజిన్‌తో కొత్త మోడల్ లాంచ్..

First Published | Jan 20, 2021, 3:56 PM IST

దేశంలోని అతిపెద్ద ఆటోమొబైల్ తయారీ  సంస్థ మారుతి సుజుకి  గత ఏడాది  భవిష్యత్తులో  ఇకపై పెట్రోల్ ఇంజన్  కార్లను మాత్రమే ఉత్పత్తి చేస్తామని ప్రకటించిన సంగతి మీకు తెలిసిందే. ఇందుకోసం కంపెనీ బిఎస్ -4 డీజిల్ ఇంజన్ల అప్‌గ్రేడ్, ఉత్పత్తి కూడా నిలిపివేసింది. అయితే కొద్ది రోజుల క్రితం దీనికి సంబంధించి ఒక నివేదిక  వెలువడింది, దీని ప్రకారం మారుతి సుజుకి 1.5 లీటర్ డీజిల్ ఇంజన్‌ను మళ్ళీ ఉత్పత్తి చేయనున్నట్లు తెలిపింది. ఈ కొత్త డిడిఎస్ డీజిల్ ఇంజన్ బిఎస్ -6 ఉద్గార ప్రమాణాల ప్రకారం రూపొందించనుంది. నివేదిక ప్రకారం కంపెనీ రాబోయే మోడళ్లలో ఈ ఇంజన్‌ను ఉపయోగించనుంది.

ప్రభుత్వం గత ఏడాది ఏప్రిల్‌ నుండి బిఎస్ -6 ఉద్గార ప్రమాణాల వాహనాలను మాత్రమే విక్రయించాలని తెలిపింది. దీంతో స్కోడా, వోక్స్వ్యాగన్ , మారుతి సుజుకి వంటి ఇతర ఆటోమొబైల్ తయారీదారులు కూడా డీజిల్ ఇంజన్లను వారి మొత్తం శ్రేణి నుండి నిలిపివేశారు. బీఎస్ -6 ప్రమాణాలకు అనుగుణంగా డీజిల్ ఇంజిన్‌లను అప్‌గ్రేడ్ చేసే ఖర్చు చాలా ఎక్కువగా ఉన్నందున భవిష్యత్తులో వారి లైనప్‌లో పెట్రోల్ మోడళ్లు మాత్రమే ఉంటాయని మారుతి సుజుకి తెలిపింది. అయితే 2020 మధ్యలో మారుతి సుజుకి డీజిల్ ఇంజన్లను తిరిగి తీసుకురావడం పై అనేక నివేదికలు వచ్చాయి.
మార్కెట్లో తగినంత డిమాండ్ ఉంటే తమ మోడళ్లలో డీజిల్ ఇంజన్‌ను తిరిగి తీసుకువస్తామని మారుతి సుజుకి గతంలోనే తెలిపింది.

ఒక నివేదిక ప్రకారం సంస్థ తన సెడాన్ కారు మారుతి సియాజ్, ఎంపివి మారుతి సుజుకి ఎర్టిగాలో కొత్త డీజిల్ ఇంజిన్‌ను ఉపయోగించనుంది. ఈ ఇంజన్ బిఎస్ -4 ఇంజన్ల యుగంలో మారుతి సుజుకి విటారా బ్రెజ్జాలో కూడా ఉపయోగించారు. ఈ ఇంజన్ 94 బిహెచ్‌పి పవర్, 225 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేసింది.
ఈ ఇంజిన్‌ను కొత్త విటారా బ్రెజ్జాలో కూడా ఉపయోగించవచ్చు. మారుతి డీజిల్ ఇంజిన్‌తో మాత్రమే బ్రెజ్జా ఎస్‌యూవీని విడుదల చేసింది. ఆ తర్వాత కంపెనీ బ్రెజా డీజిల్ ఇంజన్ మోడల్‌ను నిలిపివేసి పెట్రోల్ ఇంజన్లతో మాత్రమే అందుబాటులోకి తెచ్చింది. ఇప్పుడు ఈ పాపులర్ ఎస్‌యూవీని కొత్త 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్‌తో లాంచ్ చేయవచ్చు.
ఇవే కాకుండా, టొయోటా జాయింట్ వెంచర్‌తో కలిసి మారుతి ఒక కారును తయారు చేస్తోంది. ఇందులో ఎస్‌యూవీలు, క్రాస్‌ఓవర్‌లు, ఎమ్‌పివిలు ఉన్నాయి. ఈ మోడళ్లన్నీ భారతీయ మార్కెట్ కోసం సిద్ధం చేస్తున్నాయి.

Latest Videos

click me!