కొత్త కారు కొనేముందు టెస్ట్ డ్రైవ్ చేసేటప్పుడు ఈ 6 విషయాలను గుర్తుపెట్టుకోండి..

First Published Nov 25, 2020, 5:30 PM IST

ఏదైనా కారు కొనడానికి ముందు దాని పనితీరు,  ఫీచర్స్ మన అవసరాలకు అనుగుణంగా ఉన్నాయో, లేదో  తెలుసుకోవడం చాలా ముఖ్యం. దీనికి మొదట కారు అన్ని ఫీచర్స్, ధరల వివరాలను ఆన్‌లైన్‌లో పొందడం. అలాగే కారు టెస్ట్ డ్రైవ్ చేయడం కూడా రెండవ అతిపెద్ద ముఖ్యమైన అవసరం. కారు టెస్ట్ డ్రైవ్ సమయంలో మీరు గుర్తుంచుకోవలసిన 6 పెద్ద విషయాల గురించి ఒక్కసారి చూద్దాం. దీనితో, మీ అవసరం, సౌలభ్యం ప్రకారం ఏ కారు మీకు ఉత్తమమైనదో మీరు సులభంగా నిర్ణయించుకోవచ్చు..

చాలా మంది ప్రజలు తొందరపాటులో టెస్ట్ డ్రైవ్ చేస్తారు, ఈ కారణంగా వారు కారు సరైన పనితీరును ఊహించలేరు. అటువంటి పరిస్థితిలో తొందరపాటు నిర్ణయం కొన్ని సమయాల్లో తప్పు కావచ్చు. కాబట్టి మీకు ఎక్కువ ఫ్రీ సమయం ఉన్నప్పుడు మాత్రమే కారు టెస్ట్ డ్రైవ్ వెళ్ళడం చాలా ఉత్తమం.
undefined
టెస్ట్ డ్రైవ్ సమయంలో మీకు గుర్తుకు వచ్చే అన్ని ప్రశ్నలను, సందేహాలను ఓపెన్ గా అడగండి. కారు పనితీరు నుండి అన్నీ ఫీచర్స్ వరకు మొత్తం సమాచారాన్ని అడిగి తెలుసుకోండి. ఇందులో మీరు ఏమీ చేయనవసరం లేదు. ప్రారంభం నుండి ముగింపు వరకు వివరాలు తెలుసోవడమే.
undefined
టెస్ట్ డ్రైవ్ చేస్తున్నప్పుడు మీ ఇంటి పార్కింగ్ స్థలం ప్రకారం కారు సైజ్ గుర్తుంచుకోండి. ఇది కాకుండా ఈ కారులో ఇవ్వబడిన ఫీచర్స్ మీ అవసరాలను తీరుస్తున్నాయా, లేదా కూడా చూడండి?
undefined
మీరు కారు సరైన పనితీరును పొందాలనుకుంటే, హైవే ఇంకా నగరం రెండింటిలోనూ డ్రైవ్ చేయండి. వాస్తవానికి ప్రజలు తరచుగా ఖాళీ రహదారులపై టెస్ట్ డ్రైవ్‌లు తీసుకుంటారు, కానీ మీరు మీ కారును రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఎక్కువగా నడపాలి. అటువంటి రద్దీ ఉన్న ప్రాంతాల్లో కారు టెస్ట్ డ్రైవ్ చేయడం వల్ల కారు సామర్ధ్యం, పనితీరు వంటి ఇతర విషయాలు తెలుస్తాయి..
undefined
టెస్ట్ డ్రైవ్ అంటే కారు నడపడం కాదు. కారు పనితీరు ఎలా ఉందో, వెనుక కూర్చున్న ప్రయాణికులకు ఇది ఎలా ఉంటుందో తెలుసుకోవటానికి, కారు వెనుక సీటుపై కూర్చుని కూడా టెస్ట్ డ్రైవ్ వెళ్ళడం అవసరం. ఎందుకంటే సుదీర్ఘ ప్రయాణంలో ఈ కారు ఎలా ఉంటుందో ఇది మీకు ఒక ఆలోచన ఇస్తుంది.
undefined
టెస్ట్ డ్రైవ్ తీసుకునేటప్పుడు కారు మ్యూజిక్ సిస్టమ్‌ను ఆపివేయండి. అంతే కాకుండా టెస్ట్ డ్రైవ్ చేసేటప్పుడు మాట్లాడే బదులు ఫీచర్స్, మీ డ్రైవింగ్ అనుభవంపై పూర్తి దృష్టి పెట్టండి. దీనితో మీరు కారు ఇంజన్ సౌండ్ నుండి ఇతర ఫీచర్స్ వరకు అన్నిటిని మెరుగైన రీతిలో పరీక్షించగలుగుతారు.
undefined
click me!