ఏ వాహనమూ లేనివారికి బైక్ కొనాలని కోరిక... బైక్ వున్నవారికి కారు కొనాలనే కోరిక వుంటుంది. అయితే బైక్ అయినా, కారు అయినా... మొదటిసారి కొనేటప్పుడు ఆ ఆనందమే వేరు. ఆ కుటుంబమంతా సంతోషంలో మునిగిపోతుంది. అయితే ఇలా మొదటిసారి కారు కొనేవారు భవిష్యత్ లో ఈ కారు ఎందుకు కొన్నామురా బాబు? అని బాధపడకుండా వుండాలంటే ఇప్పుడే జాగ్రత్తగా వుండాలి.
తక్కువధరలో మంచి కంపనీకి చెందినది, ఉత్తమ మైలేజీ ఇచ్చేది, బడ్జెట్ మెయింటెనెన్స్ కలిగిన కారును ఎంపిక చేసుకోవడం చాలా ముఖ్యం. అయితే మార్కెట్ లో అనేక కంపనీలు, వాటిలో అనేక మోడల్ కార్లు వున్నాయి...వాటిలో ఏది ఉత్తమమో తెలుసుకోవడం చాలా కష్టంతో కూడిన అంశం. చాలామంది ఈ విషయంలో అయోమయానికి గురవుతుంటారు.
తొలిసారిగా కారు కొనూవారు డబ్బుకు తగిన విలువను అందించే వాహనాన్ని ఎంపిక చేసుకోవాలి. ధర,మెయింటెనెన్స్, మైలేజితో పాటు రీసెల్ విలువను కూడా చూసుకోవాలి. ఇలా సరైన కారును ఎంపికచేసి కొనుగోలుచేయడం ద్వారా మొదటిసారి కారు వాడేవారు దీర్ఘకాలికంగా ఆనందంగా వుంటారు. లేదంటే బాధపడాల్సి వస్తుంది. ఇలా బడ్జెట్ తో పాటు అన్ని అంశాల్లోనూ మెరుగైన కార్ల వివరాలు మీకోసం...