ప్రపంచంలోని అతిచిన్న హోటల్ ఎప్పుడైనా చూసారా.. కానీ ఇందులో ఉండాలంటే ఒక కండిషన్.. అదేంటంటే ?

First Published Mar 13, 2021, 3:18 PM IST

మీరు  మీ జీవితంలో ఎక్కువగా విలాసవంతమైన లేదా ఖరీదైన హోటల్ గురించి విని ఉండవచ్చు లేదా  చూసి ఉండవచ్చు, కానీ మీరు ప్రపంచంలోనే అతి చిన్న హోటల్‌ను ఎప్పుడైనా చూసారా..? దీనిని 'మినీ హోటల్' అని కూడా పిలుస్తారు. 
 

ప్రపంచంలోని ఈ చిన్న హోటల్ భవనంలో కాదు, కారులో ఉందని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఈ హోటల్ అరబ్ దేశమైన జోర్డాన్‌లో నైరుతి ఆసియాలోని అకాబా బేకు దక్షిణాన ఉంది. ఈ హోటల్ యజమాని జోర్డాన్ కు చెందిన మొహమ్మద్ అల్ మలాహిమ్. తన పాతకాలపు వోక్స్వ్యాగన్ బీటిల్ కార్ హోటల్ ప్రపంచంలోనే అతి చిన్నది, ప్రత్యేకమైనదని ఆయన పేర్కొన్నారు.
undefined
ఈ చిన్న హోటల్ 2011 సంవత్సరంలో ప్రారంభించారు. ఈ హోటల్ యజమాని "పెద్ద బండ రాళ్ల పై ఈ హోటల్ ఉందని" మొహమ్మద్ అల్ మలాహిమ్ అన్నారు. ముఖ్యంగా ఇక్కడికి వచ్చే వారు ఈ అద్భుతమైన వ్యూ చూడటానికి వస్తారు.
undefined
అయితే ఈ హోటల్ లో అతి పెద్ద సమస్య ఏమిటంటే ఒకేసారి ఇద్దరు వ్యక్తులు మాత్రమే ఈ హోటల్ లో ఉండగలరు. ఇది జంటలకు చక్కగా సరిపోతుంది. బిజినెస్ ఇన్సైడర్ నివేదిక ప్రకారం, ఇక్కడ బస చేసే అతిథులు రోజుకు 56 డాలర్లు లేదా నాలుగు వేల రూపాయలు చెల్లించాలి.
undefined
కాకపోతే మీకు కావలసినప్పుడల్లా మీరు ఈ 'మినీ హోటల్'లో ఉండటానికి వీల్లేదు, ఎందుకంటే ప్రజలు ఇక్కడ ఉండటానికి ముందుగా హోటల్ బుకింగ్ చేసుకోవాలి. ఒకోసారి నెలల తరబడి కూడా బుకింగ్ కోసం వెయిటింగ్ చేయవల్సి ఉంటుంది. ఈ పాతకాలపు వోక్స్వ్యాగన్ బీటిల్ హోటల్ ని చేతితో తయారు చేసిన ఎంబ్రాయిడరీ షీట్లు, దిండులతో అలంకరించారు. అల్-మలాహిమ్ సమీపంలోని గుహలోని ఈ హోటల్‌లో బస చేసే ప్రజలకు స్థానిక పానీయాలు, అల్పాహారాలను కూడా అందిస్తారు.
undefined
ఈ 'మినీ హోటల్' యజమాని మహ్మద్ అల్ మలాహిమ్ ఇప్పుడు జోర్డాన్ అంతటా చాలా ప్రసిద్ది చెందారు. ఒక ఇంటర్వ్యూలో తాను ఎప్పుడూ తక్కువ స్థలాన్ని ఉపయోగించే పర్యాటక ప్రాజెక్టులో పనిచేయాలని కోరుకుంటున్నానని, ఇంకా ప్రాజెక్ట్ టూరిజం రంగంలో చెరిగిపోని ఒక ముద్ర వేస్తానని అన్నాడు.
undefined
undefined
click me!