ప్రపంచ చరిత్రలోనే అత్యంత ధనవంతుడు.. అంబానీ ఆస్తికి మించిన డబ్బును విరాళంగా ఇచ్చేవాడట..
First Published Oct 21, 2020, 9:52 PM IST కరోనా ప్రపంచానికి చాలా ఆర్థిక నష్టం కలిగించింది. ఈ కరోనా వైరస్ దాదాపు ప్రతి దేశ ఆర్థిక వ్యవస్థను సంక్షోభంలోకి నేట్టింది. కానీ ఈ కాలంలో కొంతమంది ఆస్తి కూడా పెరిగింది. ఫోర్బ్స్ ప్రకారం, ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత ధనవంతుడైన అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెరోస్ సంపద 175 బిలియన్ డాలర్లు. ఈ ఫోర్బ్స్ జాబితాలో మొదటి 5 స్థానాల్లో ఒక్క భారతీయుడు కూడా లేడు. అయితే భారతీయ సంపన్నుడు ముకేష్ అంబానీ మాత్రం ఆరో స్థానంలో నిలిచాడు. కానీ ఈ రోజు మేము మీకు చెప్పబోయే వ్యక్తి గురించి, అతనికి ఎవరు సాటి రాలేరు. ఈ వ్యక్తి ఎంతో గొప్ప ధనవంతుడు, ఒక రోజులో అతను అంబానీ మొత్తం ఆస్తి కంటే ఎక్కువ డబ్బును విరాళంగా ఇచ్చేవాడు. అయితే, ఈ కారణంగా అతను, అతని దేశం రెండూ దివాళా తీశాయి. ప్రపంచంలోని అత్యంత ధనవంతుడి గురించి ఈ రోజు మీకోసం…