వర్క్ ఫ్రమ్ హోమ్ కొత్త రూల్: ఈ విషయంలో ప్రభుత్వం కీలక మార్పు చేయబోతోంది.. అదేంటంటే ?

Ashok Kumar   | Asianet News
Published : Jan 05, 2022, 11:33 AM IST

కరోనా మహమ్మారి కారణంగా ఒకవైపు ప్రజల జీవితాల్లో పెనుమార్పులు చోటు చేసుకుంటే, మరోవైపు ప్రజల ఉద్యోగాల విధానంలో పెనుమార్పు వచ్చింది. అలాగే పెరుగుతున్న ఓమిక్రాన్ (omicron)కేసుల దృష్ట్యా మరోసారి వ్యాప్తిని నిరోధించడానికి దేశంలో అనేక ఆంక్షలు విధిస్తున్నారు. దీంతో మళ్ళీ వర్క్ ఫ్రమ్ హోమ్(work from home) చర్చ పెరిగింది. 

PREV
15
వర్క్ ఫ్రమ్ హోమ్ కొత్త రూల్: ఈ విషయంలో ప్రభుత్వం కీలక మార్పు చేయబోతోంది.. అదేంటంటే ?

కాగా చాలా కార్యాలయాల్లో ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ సౌకర్యం కల్పించారు. ఈ క్రమంలో ఆర్‌జి‌పి గ్రూప్ ఛైర్మన్ హర్ష్ గోయెంకా డిసెంబర్ 31 సాయంత్రం ట్వీట్ చేస్తూ తమ కంపెనీ ఉద్యోగులందరినీ వర్క్ ఫ్రమ్ హోమ్  చేయలని, అలాగే అన్ని కార్యాలయాలు మూసివేయబడతాయని తెలియజేసారు. దీంతో పాటు పలు ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ సౌకర్యం కూడా కల్పిస్తున్నారు. ఈ విషయాలన్నీ దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం కూడా ఇలాంటి నిబంధనలు తీసుకురావాలని ఆలోచిస్తోంది. దీని కింద, ఉద్యోగులు  వర్క్ ఫ్రమ్ హోమ్  చేసే అవకాశాన్ని కూడా పొందుతారు. 

25

కార్మిక మంత్రిత్వ శాఖ కూడా  వర్క్ ఫ్రమ్ హోమ్  కోసం ముసాయిదాను విడుదల చేసింది. తయారీ, మైనింగ్, సేవా రంగాల ఉద్యోగులను ఈ ముసాయిదాలో చేర్చనున్నారు. కేంద్ర ప్రభుత్వ ఈ చర్యతో కార్యాలయాల పని సంస్కృతిలో పెను మార్పు కనిపిస్తోంది.

35

హెచ్‌ఆర్‌ఏ తీసివేయవచ్చు 
ఈ కొత్త పాలసీ ప్రకారం హౌస్ రెంట్ అలవెన్స్ (HRA)అంటే ఉద్యోగుల హెచ్‌ఆర్‌ఏలో కోత కూడా పరిగణనలోకి తీసుకోబడింది. కార్మిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన వర్క్ ఫ్రమ్ హోమ్ డ్రాఫ్ట్ ప్రకారం, కొత్త నిబంధనలలో ఐటీ రంగం ప్రత్యేక మినహాయింపులను కూడా పొందవచ్చు. ఇందులో ఐటీ ఉద్యోగులకు కూడా పనివేళల్లో సౌలభ్యం లభించే అవకాశం ఉంది.
 

45

కార్మిక మంత్రిత్వ శాఖ ప్రకారం, ఐటీ రంగంలోని ఉద్యోగుల భద్రతతో పాటు సేవా రంగానికి చెందిన అన్ని అవసరాలను దృష్టిలో ఉంచుకుని, మొదటిసారిగా ఈ ప్రత్యేక నమూనాను సిద్ధం చేశారు.

55

అంతేకాకుండా ఈ కొత్త ముసాయిదాపై కార్మిక మంత్రిత్వ శాఖ సాధారణ ప్రజల నుండి సలహాలను కూడా కోరింది. మీరు కూడా దీనికి సంబంధించి ఏదైనా సూచన ఇవ్వాలనుకుంటే, మీరు మీ సూచనను 30 రోజుల్లోపు కార్మిక మంత్రిత్వ శాఖకు పంపవచ్చు. అయితే, కార్మిక మంత్రిత్వ శాఖ ఏప్రిల్‌లో ఈ చట్టాన్ని అమలు చేసే అవకాశం ఉంది. 

click me!

Recommended Stories