Business Ideas: ఒక్క రూపాయి పెట్టుబడి పెట్టకుండా, ఒక ఫోన్ ద్వారా ఈ బిజినెస్ చేస్తే నెలకు రూ. 2 లక్షల ఆదాయం..

First Published | May 30, 2023, 6:37 PM IST

నిరుద్యోగులు ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా.. అయితే మీ సమయాన్ని వృధా చేసుకోకుండా ఓ చక్కటి బిజినెస్ ఐడియా ద్వారా మీరు ప్రతి నెల మంచి ఆదాయం పొందే అవకాశం ఉంది. ఈ బిజినెస్ ప్లాన్ ద్వారా మీరు అతి తక్కువ పెట్టుబడి తోనే చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంది. ఇందుకోసం ఎంత పెట్టుబడి పెట్టాలి ఎలాంటి బిజినెస్ ప్లాన్ అమలు చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 
 

 జీవితంలో వృద్ధాప్యం అనేది ఒక నిస్సహాయ స్థితి అని చాలా మంది భావిస్తూ ఉంటారు.  అయితే మలిసంధ్య వేళలో  చాలామంది  తమకు సహాయం చేసేందుకు ఎవరైనా ఉంటే బాగుంటుంది. అని  భావించేవారు చాలామంది ఉంటారు.  అలాంటి వారి కోసం మీరు ఆసరాగా ఒక సర్వీస్ ను ప్రారంభించవచ్చు. ఈ సర్వీసు ద్వారా మీరు ప్రతి నెల మంచి ఆదాయం పొందే వీలుంది అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Which Zodiac Signs Handle indian Money Well

మీరు సర్వీస్ తో పాటు ఆదాయం కూడా పొందాలి.  వృద్ధులకు సేవ చేస్తే సంస్థను స్థాపించడం మంచి ఆలోచన అని చెప్పవచ్చు.  ముఖ్యంగా పట్టణాల్లో పిల్లలు అమెరికాలో స్థిరపడి తల్లిదండ్రులు స్వదేశంలో ఉండే వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంది.  వీరి వృద్ధాశ్రమంలో చేరడం ద్వారా పిల్లలకు చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది అందుకే వారు ఇంట్లో ఉంటూనే వారికి సహాయకులను ఏర్పాటు చేసుకుంటున్నారు.  అయితే ఒక్కోసారి సహాయకులను గుర్తించడంలో ఇబ్బంది కలిస్తే అవకాశం ఉంది అందుకే మీరు అలాంటి అవసరం ఉన్న వృద్ధులకు సహాయకులను వెతికి పెట్టే  సర్వీసును ప్రారంభించవచ్చు. 
 


money

 ఓల్డ్ ఏజ్ హోం సర్వీసుల కోసం మీరు ముందుగా ఒక ఎన్జీవో సంస్థను స్థాపించాల్సి ఉంటుంది.  ఈ సంస్థకు సభ్యులను కూడా చేర్చుకోవాల్సి ఉంటుంది.  అనంతరం మీరు రిజిస్ట్రేషన్ చేయించుకొని సర్వీసును ప్రారంభించవచ్చు. . మీ ఎన్జీవోను పదిమందికి తెలిసేలా న్యూస్ పేపర్ యాడ్ ద్వారా తెలియజేస్తే మంచిది.  ఒక ఆఫీసును కూడా ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఈ సర్వీసును చట్టబద్ధంగా నడిపే అవకాశం ఉంది.  అలాగే ఒక పర్మినెంట్ హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఏర్పాటు చేసుకోవాలి.  ఆఫీసులో రిసెప్షనిస్టును కూడా ఏర్పాటు చేసుకోవాలి. 

money

 ఇక సర్వీస్ ను ఫోన్ ఎందుకు వచ్చిన వృద్ధులకు మీరు సహాయకులను పరిచయం చేయాల్సి ఉంటుంది అందుకే ముందుగానే సహాయకులను రిక్రూట్ చేసుకోవాల్సి ఉంటుంది.  వారికి ముందుగానే మీరు ఫస్ట్ ఎయిడ్ అదే విధంగా సిపిఆర్ పద్ధతుల్లో శిక్షణ ఇవ్వాలి అలాగే సర్వీసు పట్ల వారికి అవగాహన కల్పించేలా మోటివేట్ చేయాల్సి ఉంటుంది.  దాంతోపాటు హోం సర్వీసుల్లో ఏమేం పనులు చేయాల్సి ఉంటుందో వారికి స్పష్టంగా అర్థమయ్యేలా చెప్పి ఉంచాలి. . అన్ని రకాల పరిస్థితులను తట్టుకునేలా ప్లాన్ చేయాల్సి ఉంటుంది. 
 

అయితే మీరు సహాయకులను ఎంపిక చేసే ముందు వారి బ్యాగ్రౌండ్ చెక్ చేస్తే మంచిది. నేర ఆరోపితులు,  క్రిమినల్ రికార్డుల్లో పేరు ఉన్నవారు  వంటి వారిని గుర్తించాల్సి ఉంటుంది. వీలైతే బ్యాచిలర్ ఆఫ్ సోషల్ వర్క్ ద్వారా పట్టభద్రులైన యువతి యువకులను సహాయకులుగా మీరు అపాయింట్ చేయవచ్చు. 

money

ఇక మీరు సహాయకులను పంపే ముందు వారి జీతభత్యాలను నిర్ణయించాల్సిన అవసరం ఉంది. అనంతరం సహాయకుల వద్ద నుంచి మీరు కమిషన్ రూపంలో డబ్బు పొందవచ్చు.  మీ వ్యాపారం పెరిగే కొద్దీ ఇతర నగరాల్లో కూడా ఈ సర్వీసులను ప్రారంభించవచ్చు.  
 

Latest Videos

click me!