ప్లాట్‌ఫాం టిక్కెట్‌ ఉంటే చాలు.. ఫ్రీగా ట్రైన్లో ప్రయాణించవచ్చా?

First Published Aug 21, 2024, 10:37 AM IST

భారతీయ రైల్వే ద్వారా ప్రతిరోజూ లక్షలాది మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. రైల్వే నిబంధనల ప్రకారం టికెట్ లేకుండా ఎవరూ ప్రయాణించకూడదు. అలా ఎవరైనా టికెట్ లేకుండా  దొరికితే రైల్వే నిబంధనల ప్రకారం జరిమానా విధిస్తారు. అంతే కాకుండా రైల్వేస్టేషన్ ప్లాట్‌ఫారమ్‌పైకి వెళితే ప్లాట్‌ఫారమ్ టిక్కెట్టు కొనాల్సి ఉంటుంది.
 

ప్రయాణీకులు కాని వారు కూడా ప్లాట్‌ఫారమ్ టిక్కెట్‌లను కొనడం మీరు చూసారు. అయితే ఎవరైనా ప్లాట్‌ఫారమ్ టిక్కెట్‌తో రైలు ఎక్కితే,  ప్రయాణించడానికి అనుమతి ఉంటుందా  లేదా అనే ప్రశ్న తరచుగా ప్రజల మదిలో తలెత్తుతుంది. భారతీయ రైల్వే ప్రయాణానికి సంబంధించి అనేక రూల్స్  సెట్ చేసింది.
 

రైల్వే ప్రయాణికులు వీటిని పాటించాలి. ప్లాట్‌ఫారమ్ టిక్కెట్‌పై ప్రయాణించడం ఈ నిబంధనలలో ఒకటి. ఒక ప్రయాణీకుడు ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో  ఉండి  అతను రైలు టిక్కెట్ కొనపోతే  కానీ అతని వద్ద ప్లాట్‌ఫారమ్ టిక్కెట్ ఉంటె అప్పుడు అతను రైలులో ప్రయాణించవచ్చు. మీరు ప్లాట్‌ఫారమ్ టిక్కెట్‌తో రైలులో ప్రయాణించాల్సి వస్తే ఇందుకు  భారతీయ రైల్వే ఒక రూల్  పెట్టింది.
 

Latest Videos


రైలు ఎక్కిన వెంటనే టీటీఈని కలవాలి. టీటీఈ కలిసి అతని నుంచి టికెట్ తీసుకోవాలి. రైలులో ఖాళీ సీట్లు ఉంటే అప్పుడు టీటీఈ మీకు రూ.250 జరిమానా విధించి, మీ నుంచి చార్జెస్  వసూలు చేసి టిక్కెట్టు జారీ చేస్తారు. కానీ రైలులో ఖాళీ సీట్లు లేకున్నా  కూడా మీరు రైలులో ప్రయాణించవచ్చు అయితే TTE మిమ్మల్ని ట్రైన్ నుండి దింపలేరు.
 

చాలా మంది రైలు టిక్కెట్లు తీసుకోవడం మీరు చాలాసార్లు చూడవచ్చు కానీ టికెట్ కన్ఫర్మ్  కాలేదు. అయితే ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకున్న వారి టిక్కెట్లు క్యాన్సల్ అవుతుంటాయి. కానీ ప్లాట్‌ఫారమ్‌  టిక్కెట్ కొన్న వారు వెయిటింగ్ టిక్కెట్లతో రైలులో ప్రయాణిస్తారు. స్టాండ్‌బై టిక్కెట్‌లకు సంబంధించి భారతీయ రైల్వే రూల్ మీరు స్టాండ్‌బై టిక్కెట్‌పై ప్రయాణించలేరని స్పష్టంగా చేసింది. మీరు ఇలా చేస్తూ TTE పట్టుకుంటే, అతను మిమ్మల్ని రైలు నుండి దింపవచ్చ్చు.
 

click me!