రూపాయి విలువ ఎందుకు పడిపోతోంది..అసలు రూపాయి విలువను ఎవరు నిర్ణయిస్తారు ?

Published : Oct 20, 2022, 02:53 PM IST

రూపాయి క్షీణత కొనసాగుతోంది. రోజురోజుకూ రూపాయి మారకం విలువ కొత్త రికార్డులు క్రియేట్ చేస్తు పతనం అవుతోంది. ఇప్పటికే రూపాయి విలువ డాలర్ కు ప్రతిగా 83 రూపాయలకు పతనమైంది.  అయితే రూపాయి పతనం వల్ల సామాన్యులకు ఏం తేడా వస్తుంది.రూపాయి విలువ క్షీణించడం ప్రయోజనకరమా? అసలు రూపాయి విలువను ఎవరు నిర్ణయిస్తారు? దీని గురించి వివరంగా తెలుసుకుందాం...  

PREV
16
రూపాయి విలువ ఎందుకు పడిపోతోంది..అసలు రూపాయి విలువను ఎవరు నిర్ణయిస్తారు ?

SBI మాజీ చీఫ్ ఎకనామిస్ట్ బృందా జాగీర్దార్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, రూపాయి ఆరోగ్యం నేరుగా సామాన్యులపై పడుతుందని చెప్పారు.రూపాయి విలువ పతనమైతే విదేశాల నుంచి వస్తువులను దిగుమతి చేసుకొనే వస్తువులన్నీ ఖరీదుగా మారుతాయి.  దీనికి సరైన ఉదాహరణ ముడి చమురు దిగుమతి  అనే చెప్పాలి.

26
rupee

ప్రపంచంలోనే అతిపెద్ద చమురు దిగుమతిదారుగా భారత్ ఉంది. అటువంటి పరిస్థితిలో, రూపాయి బలహీనపడితే, భారతదేశం మరిన్ని ఎక్కువ రూపాయలు  ఖర్చు చేయాలి. ఎందుకంటే ఇరాన్ మినహా, భారత్ సాధారణంగా డాలర్లలో ముడి చమురును కొనుగోలు చేస్తుంది. అటువంటి పరిస్థితిలో, రూపాయి బలహీనపడినప్పుడు, భారతదేశం ఎక్కువ ఖరీదుతో ముడి చమురును దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. దాని కారణంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం ఉంది. పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగితే దేశంలో కూరగాయల నుంచి పప్పుల వరకు అన్నీ ఖరీదు పెరుగుతాయి. 

36

ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపుతుంది
రూపాయి పతనం కారణంగా విదేశాల నుంచి ఏ వస్తువు కొనాలన్నా ప్రభుత్వం ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తోంది. దీని వల్ల భారత్ లోటు పెరుగుతుంది. అదే సమయంలో విదేశీ మారకద్రవ్య నిల్వలు కూడా తగ్గిపోతాయి. అంతే కాదు విదేశీ బ్యాంకుల నుంచి తీసుకునే రుణాలకు ఎక్కువ వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. 

46

రూపాయి ఎందుకు పతనం అవుతుందో తెలుసుకుందాం
 ఒక దేశంపెద్ద సంఖ్యలో వస్తువులను దిగుమతి చేసుకొని,  తక్కువ  సంఖ్యలో వస్తువులు,  సేవలను ఎగుమతి చేస్తే, రూపాయి బలహీనపడుతుంది, అలా జరగడం వల్ల ఒక దేశం నష్టపోవాల్సి వస్తుంది. ఈ ఎగుమతి దిగుమతి మధ్య అంతరాన్ని కరెంట్ ఎకౌంట్ డెఫిసిట్ అంటారు. ఈ నష్టాన్ని పూడ్చుకోవాలంటే రుణం తీసుకోవాల్సిందే, ఇది దేశ ఆర్థిక వ్యవస్థను మరింత బలహీన పరుస్తుంది.

56

ఎవరికి లాభం..ఎవరికి నష్టం
డాలర్ ప్రపంచంలోనే బలమైన కరెన్సీ. ప్రపంచంలో చాలా వ్యాపారం డాలర్లలో జరుగుతుంది. విదేశాల నుంచి మనం ఏదైన వస్తువును దిగుమతి చేసుకోవాలంటే మనం డాలర్లలో చెల్లించాలి. ఒక వేళ మనం ఏదైన వస్తువును విదేశాలకు అమ్మినప్పుడు కూడా మనకు డాలర్ల రూపంలోనే ఆదాయం వస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో మన దేశం ఎక్కువగా విదేశాల నుంచి దిగుమతులు చేసుకుంటోంది, అదే సమయంలో మన సరుకులను తక్కువ ఎగుమతి చేస్తున్నాం. దీని వల్ల మనం ఇతర దేశాలకు ఎక్కువ డాలర్లు చెల్లిస్తున్నాము,మనకు తక్కువ డాలర్లు లభిస్తున్నాయి. సరళమైన భాషలో, మేము ప్రపంచానికి తక్కువ వస్తువులను విక్రయిస్తున్నాము మరియు ఎక్కువ కొనుగోలు చేస్తున్నాము.

66

రూపాయి విలువను ఎవరు నిర్ణయిస్తారు..
ఒక దేశపు కరెన్సీని మరొక దేశపు కరెన్సీతో మార్చుకునే ధర ని 'ఎక్స్‌చేంజ్ రేట్' అంటారు. ఒక దేశం  కరెన్సీ విలువ మార్కెట్‌లో దాని డిమాండ్  సరఫరాపై ఆధారపడి ఉంటుంది. సులభంగా అర్థమయ్యేలా చెప్పాలంటే ఫారిన్ ఎక్స్ చేంజ్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న కరెన్సీలను కొనుగోలు చేసి విక్రయించే అంతర్జాతీయ మార్కెట్. ఇక్కడ ఒక కరెన్సీకి బదులుగా స్థిరమైన రేటుతో మరొక కరెన్సీని కొనుగోలు చేస్తారు లేదా అమ్ముతారు. రెండు కరెన్సీలను కొనుగోలు చేసే, విక్రయించే రేటును మార్పిడి రేటు అంటారు. డిమాండ్, సరఫరా సూత్రం ప్రకారం ఈ మారకపు రేటు హెచ్చుతగ్గులకు లోనవుతోంది.
 

Read more Photos on
click me!

Recommended Stories