న్యూ ఇయర్ జనవరి 1నే ఎందుకు జరుపుకుంటారు, దీని చరిత్ర ఏమిటో తెలుసా..?

Ashok Kumar   | Asianet News
Published : Dec 30, 2021, 06:47 PM IST

 కొత్త సంవత్సరానికి ప్రజలు సన్నాహాలు ముమ్మరంగా చేస్తుంటారు, అయితే కరోనా(corona) మహమ్మారి ప్రజల వేడుకలను  ఆందోళనలో పడేసే అవకాశం ఉంది. చాలా మంది పాత జ్ఞాపకాలను వదిలేసి కొత్త సంవత్సరంలో కొత్త శుభారంభం చేయాలని కోరుకుంటారు. కొత్త సంవత్సరాన్ని జనవరి 1న మాత్రమే ఎందుకు జరుపుకుంటారో తెలుసా..

PREV
14
న్యూ ఇయర్ జనవరి 1నే ఎందుకు జరుపుకుంటారు, దీని చరిత్ర ఏమిటో తెలుసా..?

ఇంతకుముందు జనవరి 1న నూతన సంవత్సరాన్ని జరుపుకోలేదనే విషయం తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. జనవరి 1న కొత్త సంవత్సరాన్ని జరుపుకోవడం 1582 అక్టోబర్ 15న ప్రారంభమైంది. దీనికిముందు ప్రజలు మార్చి 25న అలాగే కొన్నిసార్లు డిసెంబర్ 25న కొత్త సంవత్సరాన్ని జరుపుకునేవారు. రోమ్ కింగ్ నుమా పాంపిలస్ రోమన్ క్యాలెండర్‌ను మార్చారు, ఆ తర్వాత జనవరిని సంవత్సరంలో మొదటి నెలగా పరిగణించారు. పూర్వం మార్చిని సంవత్సరంలో మొదటి నెలగా పిలిచేవారు. దీని వెనుక ఉన్న కథ ఏంటో తెలుసుకుందాం...
 

24

మార్చికి మార్స్ గ్రహం పేరు పెట్టారు. రోమ్‌లోని ప్రజలు మార్స్‌ను యుద్ధ దేవతగా భావిస్తారు. మొదటి క్యాలెండర్ సృష్టించిన దాంట్లో కేవలం 10 నెలలతో  మాత్రమే సృష్టించారు. దింతో సంవత్సరంలో 310 రోజులు, 8 రోజులు ఒక వారంగా పరిగణించేవారు.

34

రోమన్ పాలకుడు జూలియస్ సీజర్ ఈ క్యాలెండర్‌ను మార్చాడని చెబుతారు. జనవరి 1న కొత్త సంవత్సరాన్ని ప్రారంభించిన జూలియస్ సీజర్ క్యాలెండర్‌ను మార్చిన తర్వాత సంవత్సరం 12 నెలలకు పోడిగించారు. జూలియస్ సీజర్ ఖగోళ శాస్త్రవేత్తలతో సమావేశమయ్యాక భూమి సూర్యుని చుట్టూ 365 రోజుల  ఆరు గంటలలో తిరుగుతుందని కనుగొనబడింది. దీని దృష్ట్యా జూలియన్ క్యాలెండర్‌లో సంవత్సరాన్ని 365 రోజులకు సవరించారు.
 

44

పోప్ గ్రెగొరీ 1582 సంవత్సరంలో లీపు సంవత్సరాల గురించి జూలియన్ క్యాలెండర్‌లో పొరపాటును కనుగొన్నాడు. ఆ కాలపు ప్రముఖ మత గురువు సెయింట్ బీద్ ఒక సంవత్సరంలో 365 రోజుల 5 గంటల 46 సెకన్లు ఉంటాయని చెప్పాడు. దీని తరువాత రోమన్ క్యాలెండర్ మార్చబడింది ఇంకా కొత్త క్యాలెండర్ సృష్టించబడింది. అప్పటి నుండి కొత్త సంవత్సరం జనవరి 1 నుండి జరుపుకోవడం ప్రారంభమైంది.

click me!

Recommended Stories