అమెరికాలోని ఈ రహస్య ఆర్మీ స్థావరంపైకి గ్రహాంతర వాసులు వచ్చి వెళుతున్నారని మెక్సికో తెగ వారు పేర్కొంటున్నారు. అంతేకాకుండా వీరు షాకింగ్ స్టేట్మెంట్లు కూడా చేశారు. తమ ఆవులను గ్రహాంతర వాసులు ఎత్తుకెళ్లారని, వాటి అవయవాలను నరికివేస్తున్నారని ఇక్కడి స్థానికులు చెబుతున్నారు. గ్రహాంతరవాసుల చేష్టలతో ఇబ్బంది పడ్డామని కూడా అంటున్నారు. పర్వతం చుట్టూ యూఎఫ్‌ఓలు తరచుగా కనిపిస్తాయని చెప్పారు. న్యూ మెక్సికోలోని డుల్సే నగరానికి సమీపంలో మెక్సికన్ తెగ గ్రామం ఉంది.