WhatsApp: వాట్సాప్‌లో కొత్త అప్‌డేట్, లిస్ట్ ఫీచర్ అదిరిపోయింది. ఇక మెసేజ్‌లు మేనేజ్ చేయడం చాలా ఈజీ

Published : Mar 11, 2025, 04:06 PM IST

WhatsApp: వాట్సాప్ తన యూజర్ల కోసం కొత్త ఫీచర్లు తెస్తూనే ఉంది. ఇప్పుడు వాట్సాప్ 'లిస్ట్ క్రియేషన్ ఫీచర్' ఒకటి తెచ్చింది. దీనితో యూజర్లు తమ చాట్‌లను ఇంకా బాగా సెట్ చేసుకోవచ్చు. ఈ కొత్త ఫీచర్ ఎలా ఉపయోగించాలో వివరంగా తెలుసుకుందాం రండి.

PREV
14
WhatsApp: వాట్సాప్‌లో కొత్త అప్‌డేట్, లిస్ట్ ఫీచర్ అదిరిపోయింది. ఇక మెసేజ్‌లు మేనేజ్ చేయడం చాలా ఈజీ

'లిస్ట్ క్రియేషన్' అంటే ఏంటి?

వాట్సాప్ ఈ కొత్త ఫీచర్ ద్వారా యూజర్లు ఇప్పుడు తమ చాట్‌లను రకాలుగా సెట్ చేసుకోవచ్చు. ఉదాహరణకు మీ ఫ్యామిలీ చాట్‌లు తొందరగా చూడాలంటే, 'ఫ్యామిలీ' అని ఒక లిస్ట్ చేసుకోవచ్చు.

అలాగే, 'ఆఫీస్', 'ఫ్రెండ్స్' అని వేర్వేరు లిస్ట్‌లు ఏర్పాటు చేసుకుని ఇంపార్టెంట్ చాట్‌లు ఈజీగా వెతుక్కోవచ్చు. ఈ ఫీచర్ వచ్చాక యూజర్ల చాట్‌లు ముందుకన్నా నీట్‌గా ఉంటాయి. ఈజీగా దొరుకుతాయి.

24

'లిస్ట్' ఫీచర్ ఎలా వాడాలి?

ఈ కొత్త ఫీచర్ వాడటం చాలా ఈజీ.

మీ చాట్స్ ట్యాబ్‌కి వెళ్ళి, పైన ఉన్న + గుర్తుని నొక్కండి.

ఆ తర్వాత, మీకు కావాల్సిన లిస్ట్ ఒకటి చేసి, అందులో ఆ చాట్‌లను కలపండి.

వాట్సాప్‌లో చాలా చాట్‌లు ఉన్నవాళ్ళకి, వాటిని సెట్ చేయడం కష్టంగా ఉన్నవాళ్ళకి ఈ ఫీచర్ బాగా పనికొస్తుంది.

34

వాట్సాప్ ఈ కొత్త ఫీచర్ వల్ల లాభాలు

వాట్సాప్ యాప్ ని నీట్‌గా సెట్ చేసుకోవచ్చు.  ఎందుకంటే ఇప్పటికే ఒక్కొక్కరు వందల గ్రూప్ ల్లో ఉన్నారు. కొంతమంది పర్సనల్ గా కూడా గుడ్ మార్నింగ్ లు, గుడ్ నైట్ లు చెబుతుంటారు. ఇంత మెసేజ్ ట్రాఫిక్ లో మనకు కావాల్సిన ఇంపర్టెంట్ మెసేజ్ లను వెతుక్కోవడం కష్టం కాబట్టి లిస్ట్ ఆప్షన్ బాగా ఉపయోగపడుతుంది. 

44

ఈ ఫీచర్ ఇంకా మీ మొబైల్ లో కనిపించకపోతే కంగారు పడకండి. ఎందుకంటే వాట్సాప్ ఈ కొత్త ఫీచర్ కొంచెం కొంచెంగా అందరికీ ఇస్తోంది. ఈ ఫీచర్ మీకు ఇంకా రాకపోతే ఒకసారి మీ వాట్సాప్‌ని కొత్తగా అప్డేట్ చేశారా లేదా చూసుకోండి. అయినా రాకపోతే త్వరలోనే మీ మొబైల్ కి వస్తుంది.

click me!

Recommended Stories