whatsapp ప్రపంచ వ్యాప్తంగా పేరుపొందిన ఇన్ స్టంట్ మెసేజింగ్ యాప్. దీని ద్వారా ఫ్రెండ్స్, తెలుసున్న వారు ఇలా అందరూ ఎప్పుడూ కనెక్ట్ అయి ఉంటారు. స్నేహితులతో గంటల తరబడి చాటింగ్ చేసుకోవడం, కాల్స్ ద్వారా మాట్లాడుకోవడం చేస్తుంటారు. ఇలా వాట్సాప్ ప్రజలందరికీ బాగా కనెక్ట్ అయిపోయింది.
మనకి ప్రతి రోజూ మన ఫ్రెండ్స్, రిలేటివ్స్, అందరూ వివిధ రకాల మెసేజ్ లు, వీడియోలు, పోస్ట్ చేస్తుంటారు. వాటిని వాట్సాప్, ఇన్ స్టాగ్రాం, ఫేస్ బుక్ ల్లో పోస్ట్ చేస్తుంటారు. గుడ్ మార్నింగ్ లు, కొటేషన్స్, వార్తలు, ఇలా అనేక రకాల విషయాలను మనతో పంచుకోవాలని పోస్టులు పెడుతుంటారు. మనకు పర్సనల్ గా పోస్టులు పెడితే మనం చూసి రిప్లై ఇవ్వడమే, లైక్ చేయడమే చేయొచ్చు.