స్టాక్ మార్కెట్లో కూడా దుమ్ము రేపుతున్న గదర్ 2, జైలర్ సినిమా రికార్డులు కారణం ఏమిటంటే..?

First Published | Aug 16, 2023, 12:18 PM IST

ఓటీటీ విజృంభించడంతో చతికిలబడ్డటువంటి సినిమా థియేటర్లకు సన్నిడియోల్, రజనీకాంత్ నటించిన సినిమాలు జీవం పోశాయి. గతవారం విడుదలైనటువంటి గదర్ 2, జైలర్ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డు సృష్టిస్తున్నాయి దీంతో ప్రముఖ మల్టీప్లెక్స్ చైన్ అయినటువంటి పీవిఆర్ ఐనాక్స్ షేర్లు ఒక్కసారిగా లాభాల బాట పట్టాయి.

సన్నీ డియోల్ గదర్-2 బాక్సాఫీస్ దగ్గర  చరిత్రను తిరగరాస్తోంది.  ఇప్పటికే ఈ సినిమా 300 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి ఫాస్టెస్ట్ రెవెన్యూ సాధిస్తున్న సినిమాగా నిలుస్తోంది.  దాంతోపాటు దక్షిణాదిలో రజనీకాంత్ నటించిన జైలర్ సినిమా కూడా భారీ విజయం సాధించి దాదాపు 300 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది.  అలాగే అక్షయ్ కుమార్ నటించినటువంటి ఓ మై గాడ్ టు సినిమా కూడా మంచి వసూళ్లను రాబడుతోంది.  ఈ నేపథ్యంలో ప్రముఖ మల్టీప్లెక్స్ చైన్ అయినటువంటి పివిఆర్ ఐనాక్స్ షేర్లు ఒక్కసారిగా లాభాలతో దూసుకెళ్తున్నాయి.  

గత వారంలో రిలీజ్ అయినటువంటి  సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద సక్సెస్ సాధించడంతో మల్టీప్లెక్స్ చైన్ కంపెనీ PVR-Inox  షేర్లు ఒక్కసారిగా  విజృంభించాయి. సోమవారం, మల్టీప్లెక్స్ చైన్ కంపెనీ PVR-Inox యొక్క స్టాక్ మంచి బూమ్ చూస్తోంది. PVR-Inox స్టాక్ 5.26 శాతం, రూ. 87 లాభంతో రూ.1725 వద్ద ట్రేడవుతోంది. 


PVR -Inox స్టాక్ పెరగడానికి కారణం గత వారాంతంలో మల్టీప్లెక్స్‌లకు రికార్డ్ ఆదాయాలు రావడమే కారణమని  నిపుణులు చెబుతున్నారు. ఆగస్ట్ 13న ఒక్క రోజులో అత్యధిక సంఖ్యలో  ప్రేక్షకులు మల్టీప్లెక్స్‌లలో సినిమాను వీక్షించారని PVR-Inox స్టాక్ ఎక్స్ఛేంజ్‌కు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలియజేసింది. ఒక్క రోజులో 12.8 లక్షల మంది వీక్షకులను తమ మల్టీప్లెక్స్‌కు స్వాగతించామని, దీని కారణంగా ఒక్క రోజులో రికార్డు స్థాయిలో రూ.39.5 కోట్ల బాక్సాఫీస్ కలెక్షన్లు రాబట్టినట్లు కంపెనీ తెలిపింది.
 

ఆగస్ట్ 11 - 13 తేదీల మధ్య జరిగిన వారాంతం కంపెనీ చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన వారాంతం అని పివిఆర్-ఐనాక్స్ తెలిపింది. ఈ రోజుల్లో, PVR-Inox మల్టీప్లెక్స్‌లలో మొత్తం 33.6 లక్షల మంది  ప్రేక్షకులు సినిమాను వీక్షించారు, దీని కారణంగా ఈ వారాంతంలో కంపెనీకి బాక్స్ ఆఫీస్ ఆదాయం రూ. 100 కోట్లకు పైగా వచ్చిందని  పేర్కొంది.

 గత వారం హిందీలో సన్నీ డియోల్ గదర్-2, అక్షయ్ కుమార్ OMG, రజినీ కాంత్ జైలర్ మూడు సినిమాలు విడుదలయ్యాయని కంపెనీ తెలిపింది. అద్భుతమైన కంటెంట్ కారణంగా ఈ సినిమాలకు అద్భుతమైన స్పందన వస్తోంది. భారతదేశం, శ్రీలంకతో సహా 115 నగరాల్లో 1708 స్క్రీన్‌లను కలిగి ఉన్న PVR-Inox దేశంలో అతిపెద్ద మల్టీప్లెక్స్ కంపెనీ. 

 గత వారం హిందీలో సన్నీ డియోల్ గదర్-2, అక్షయ్ కుమార్ OMG, రజినీ కాంత్ జైలర్ మూడు సినిమాలు విడుదలయ్యాయని కంపెనీ తెలిపింది. అద్భుతమైన కంటెంట్ కారణంగా ఈ సినిమాలకు అద్భుతమైన స్పందన వస్తోంది. భారతదేశం, శ్రీలంకతో సహా 115 నగరాల్లో 1708 స్క్రీన్‌లను కలిగి ఉన్న PVR-Inox దేశంలో అతిపెద్ద మల్టీప్లెక్స్ కంపెనీ. 

Latest Videos

click me!