బంగారం ధర విషయానికి వచ్చినట్లయితే, హైదరాబాదులో ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 59,510 రూపాయలుగా ఉంది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 54,550 రూపాయలుగా ఉంది. గడచిన 15 రోజులుగా గమనించినట్లయితే బంగారం ధరలు వరుసగా దిగి వస్తున్నాయి. నిన్నటితో పోల్చి చూసినట్లయితే బంగారం ధర 110 రూపాయలు తగ్గింది దీంతో మహిళలు తగ్గుతున్న బంగారు నగల ధరలు చూసి పండగ చేసుకుంటున్నారు.